Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా

దేశవ్యాప్తంగా జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆరు రాష్ట్రాల్లో.. మూడు లోక్‌సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా

Bypoll

Updated On : May 25, 2022 / 9:19 PM IST

Bypoll Schedule: దేశవ్యాప్తంగా జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆరు రాష్ట్రాల్లో.. మూడు లోక్‌సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 23న ఎన్నికలు నిర్వహించి, 26న ఫలితాలు ప్రకటిస్తారు. పంజాబ్, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, ఝార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. పంజాబ్‌లోని సంగ్రూర్ లోక్‌సభ స్థానం, ఉత్తర ప్రదేశ్‌లోని ఆజాంఘర్, రామ్‌పూర్ లోక్‌సభ స్థానాలతోపాటు, త్రిపురలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఝార్ఖండ్‌లోని ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతాయి.

RSS Founder: పాఠంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి స్పీచ్.. వ్యతిరేకంగా నిరసనలు

ఏపీకి సంబంధించి ఇటీవల మరణించిన గౌతం రెడ్డి నియోజకవర్గమైన ఆత్మకూరు ఎన్నిక జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలోని రాజిందర్ నగర్ నియోజకవర్గం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఇక్కడ్నుంచి ఆమ్ఆద్మీ తరఫున అసెంబ్లీకి ఎన్నికైన రాఘవ్ చద్దా, రాజ్యసభకు నామినేట్ అయ్యారు. దీంతో ఆయన నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ భావిస్తోంది. గతంలో ఈ నియోజకవర్గంలో బీజేపీకి పట్టు ఉండేది. ఈ ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే, అది ఆమ్ఆద్మీ పార్టీపై ఒత్తిడి పెంచుతుందని బీజేపీ అభిప్రాయం.