Bajaj Chetak : బజాజ్ చేతక్ ధర రూ.10 వేలు.. ఫియట్ కారు రూ.9 వేలు

Bajaj Chetak : బజాజ్ చేతక్ ధర రూ.10 వేలు.. ఫియట్ కారు రూ.9 వేలు

Bajaj Chetak

Bajaj Chetak : అవును మీరు విన్నది నిజమే.. రూ.10 వేలకు బజాజ్ చేతక్ స్కూటర్, 9 వేలకు ఫియర్ కారు, 22000 వేలకు అంబాసిడర్ కారు.. ఈ వాహనాలు మార్కెట్లోకి వచ్చిన సమయంలో పైన చెప్పిన ధరలకు లభించేవి. అప్పట్లో పదివేలు అంటే చాలా ఎక్కువే.. కూలికి వెళితే రోజుకు రూ.5 వచ్చే రోజుల్లో స్కూటర్ ధర రూ.10 వేలు ఉండేది. భూస్వాములు, అధికారులు వీటిపై తిరిగేవారు. సామాన్యులు వీటిని చూసి తెగ ఆనందించేవారు.

ఇక ఒకసారి భారత మార్కెట్లోకి వచ్చిన సమయంలో వివిధ వాహనాల ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

బజాజ్ చేతక్

బజాజ్ చేతక్ స్కూటర్.. 2000 సంవత్సరం వరకు వీటి వాహ కొనసాగింది. చేతక్ సౌండ్ కి చాలామంది అభిమానులు ఉన్నారు. భారీ అంచనాలతో 1987లో మార్కెట్లోకి వచ్చిన ఈ మోటర్ సైకిల్ భారతీయులను ఆకట్టుకుంది.  మార్కెట్లోకి వచ్చి అనధికాలంలోనే అమ్మకాల రికార్డు క్రియేట్ చేసింది. 1995 నాటికి దేశంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఈ బజాజ్ చేతక్ కనిపించేది. 1987లో మార్కెట్ లోకి విడుదల చేసిన రోజు దీని ధర. 10,652గా ఉంది.

బజాజ్ వెస్పా

1961లో మార్కెట్లోకి వచ్చిన బజాజ్ వెస్పా ధర కేవలం రూ. 2,129 మాత్రమే. పెట్రోల్ ఇంజన్ తో వచ్చిన ఈ మోటర్ సైకిల్.. సింగిల్ సీట్ తో ఇచ్చారు. డబుల్ సీట్ సెట్ చేసుకునే ప్లేస్ ఉండేలా డిసైన్ చేశారు. అయితే డబుల్ సీటును ప్రత్యేకంగా కొనాల్సి ఉంటుంది. సీటు, స్పేర్ వీల్, ట్యూబ్‌ కావాలంటే అందనంగా మరో రూ.114 చెల్లిస్తే సరి.

 

రాజ్‌దూత్‌

భారత మార్కెట్ ని షాక్ చేసిన మోటర్ సైకిల్ రాజ్‌దూత్‌.. అప్పట్లో దీనికి ఉన్న క్రీజ్ వేరు. జీవితంలో ఒక్కసారైనా రాజ్‌దూత్‌ ఎక్కాలని చాలామంది కలలుకనే వారు. 1980వ దశకంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా వచ్చిన రాజ్‌దూత్‌ మార్కెట్ లో ఓ మార్క్ క్రియేట్ చేసింది. ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఈ వాహనాలు అధికంగా వాడేవారు. ఇక దేశంలో మొట్టమొదటి సారి ఈఎంఐని ప్రవేశపెట్టింది.. ఈ కంపెనీనే.. రూ.3500 కట్టి బండిని ఇంటికి తీసుకెళ్లవచ్చని ప్రకటన ఇచ్చింది. దీన్ని రిలీజ్ చేసినప్పుడు ధర రూ.18000లుగా ఉంది.

 

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. ఇంగ్లాండ్ కు చెందిన ఈ కంపెనీ 1963లో తన మొదటి మోడల్ బైక్ ను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని సౌండ్ చాలామంది ఇష్టపడతారు. ఈ బండి స్టార్ట్ చేస్తే అటుఇటుగా రెండు కిలోమీటర్ల దూరం దీని సౌండ్ వినిపిస్తుంది. 750 సీసీ ఇంజన్ తో మార్కెట్లోకి తీసుకొచ్చారు. అప్పట్లో ఈ బైక్ ఉందంటే వారిది రాయల్ ఫ్యామిలీ అని ఫిక్స్ అయ్యి పోయేవారు. అప్పట్లో ఈ బైక్ లను పోలీస్ అధికారులతోపాటు, భూస్వాములు అధికంగా వాడేవారు.

 

మహీంద్రా జీపు

దేశీ వాహన తయారీ కంపెనీల్లో మహీంద్రా అండ్‌ మహీంద్రాని ప్రత్యేక స్థానం. పదిహేనేళ్ల కిందటి వరకు కూడా రూరల్‌ ఇండియా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో మహీంద్రా జీపులది ప్రత్యేక స్థానం. ఈ కంపెనీ తయారు చేసిన జీపుల్లో కమేండర్ కు చాలా ప్రత్యేకత ఉంది. ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో ఇవి కనిపిస్తాయి. అయితే 1960 మహీంద్రా జీపు ధర కేవలం రూ. 12,421 మాత్రమే. అంతేకాదు ఆ రోజుల్లో అమ్మకాలు పెంచేందుకు రూ. 200 డిస్కౌంట్‌ కూడా ప్రకటించింది.

 

షెవర్లేట్‌

1936లో మార్కెట్లోకి వచ్చిన ఈ కారును రచయితలు, కథానాయకులు అధికంగా ఉపయోగించేవారు. ఐదుగురు కూర్చునేందుకు వీలుగా ఈ కారును తయారు చేశారు. దీని ధర రూ.3,675గా ఉండేది. రచయితలు తమ కథనాయకుడు, నాయికల ఎంత ధనవంతులో వర్ణించేందుకు షెవర్లెట్‌ పేరును తరచుగా ఉపయోగించేవారు.

అంబాసిడర్‌.

1975 – 2000 మధ్య కాలంలో అంబాసిడర్ కారుకు ఉన్న క్రీజ్ వేరు. రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు అత్యధికంగా వాడేవారు. పైన ఎర్ర, పచ్చ బుగ్గలు (లైట్) పెట్టుకొని తిరిగేవారు. ఆ లైట్ వారి హోదాను తెలియచేసేది. ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్‌ మోటార్స్‌ తయారు చేసిన ఈ కార్లు ఇంచుమించు 2000 వరకు ఇండియా రోడ్లపై తమ ఆధిపత్యం చూపించాయి. 3 వేరియంట్లతో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు.. ధరలను ఓ సారి పరిశీలిద్దాం.

DC Designed VIP Amby - Ambierod - Ambassador - YouTube

హిందూస్తాన్ అంబాసిడర్ – రూ. 24,000
ప్రీమియర్ పద్మిని – రూ. 22,000
స్టాండర్డ్ హెరాల్డ్ – రూ. 22,700

ఫియట్ కారు

ఫియట్ కారు.. రాజకీయ నాయకులు కుటుంబ సభ్యుల కోసం ఈ కారు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో చాలామంది ఈ కారును వాడిన వారు ఉన్నారు. ఇక ఈ కారు ధర రూ.9,800లుగా ఉంది.

Image