Adipurush : ఆదిపురుష్ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు ఓం రౌత్..
ప్రభాస్ (Prabhas) నటిస్తున్న 'ఆదిపురుష్' (Adipurush) నుంచి అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు దర్శక నిర్మాతలు.

Om Raut gave clarity on Adipurush release date
Adipurush : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మైథిలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’ (Adipurush). రామాయణం బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ (Kriti Sanon) సీతగా కనిపించబోతున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. టి-సిరీస్ (T-Series) ఫిలిమ్స్ ప్రొడక్షన్ లో భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దాదాపు 550 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ టీజర్ రిలీజ్ అయిన తరువాత VFX వర్క్స్ ట్రోలింగ్ గురి అవ్వడం, కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు కూడా ఉన్నాయి అని వివాదం రేగడంతో మూవీ టీం రీ వర్క్ కి వెళ్లారు.
Salaar : పాన్ వరల్డ్ సినిమాగా రాబోతున్న సలార్.. నిజమేనా?
అన్ని తప్పులు సరిదిద్దుకొని ఈ ఏడాది జూన్ 16న రిలీజ్ చేస్తామంటూ గతంలోనే ప్రకటించారు. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో సినిమా మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యిందంటూ వార్తలు మొదలయ్యాయి. దీంతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా దర్శకుడు ఓం రౌత్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో దర్శక నిర్మాతలు స్పందించి ఆదిపురుష్ అప్డేట్ ఇచ్చారు. సినిమా సక్సెస్ కావాలని దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్.. జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించి ప్రార్ధించారు.
Project K : ప్రభాస్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే అప్డేట్.. ప్రాజెక్ట్-K రిలీజ్ డేట్!
అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ.. సినిమా రిలీజ్ డేట్ లో ఎటువంటి మార్పు లేదని తెలియజేశారు. మరి ఇప్పటి నుంచి అయినా ప్రమోషన్స్ మొదలు పెడతారా? లేదా? చూడాలి. ఈ నెల 30న శ్రీరామనవమి పండుగా ఉంది. ఆరోజు ఏమన్నా టీజర్ లాంటిది రిలీజ్ చేస్తారా, లేదా ఎప్పటిలాగా ఒక ఫోటో రిలీజ్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.
*To a Mangalkaari Shurwaat!*
Seeking divine blessings at Vaishno Devi ?#Adipurush releases IN THEATRES on June 16, 2023 in 3D.#Adipurush #Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 #ShivChanana pic.twitter.com/V0d3j3boL1— T-Series (@TSeries) March 28, 2023