Omicron In Delhi : ఢిల్లీలో ఆ 2 రోజులు..84శాతం శాంపిల్స్ లో ఒమిక్రాన్

ఓ వైపు కోవిడ్,మరోవైపు ఒమిక్రాన్ కేసులు ఢిల్లీని వణికిస్తున్నాయి. దేశరాజధానిలో కోవిడ్ కేసులు పూర్తిగా తగ్గిపోయాయ్ అనుకున్న సమయంలోనే ఒమిక్రాన్ రూపంలో కోవిడ్ కొత్త వేరియంట్ ఢిల్లీపై

Omicron In Delhi : ఢిల్లీలో ఆ 2 రోజులు..84శాతం శాంపిల్స్ లో ఒమిక్రాన్

Covid

Omicron In Delhi :  ఓ వైపు కోవిడ్,మరోవైపు ఒమిక్రాన్ కేసులు ఢిల్లీని వణికిస్తున్నాయి. దేశరాజధానిలో కోవిడ్ కేసులు పూర్తిగా తగ్గిపోయాయ్ అనుకున్న సమయంలోనే ఒమిక్రాన్ రూపంలో కోవిడ్ కొత్త వేరియంట్ ఢిల్లీపై దాడి చేసింది. వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగిన ఒమిక్రాన్..ఢిల్లీలో కేసుల పెరుగుదలకు కారణమైంది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో కోవిడ్,ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీ ఆరోగ్యశాఖ చేసిన ఓ ప్రకటలో అక్కడి ప్రజల్లో మరింత టెన్షన్ మొదలైంది.

ఇవాళే అందిన శాంపిల్స్ యొక్క జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్ట్ ల ప్రకారం…డిసెంబర్-30,31 తేదీల్లో దేశరాజధానిలో నిర్వహించిన కోవిడ్ టెస్ట్ లలో..84శాతం శాంపిల్స్ లో ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించినట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ప్రకటించారు. అయితే తాజా రిపోర్ట్ లు రాకముందు నాటికి ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 351 గా ఉంది. దేశంలో మహారాష్ట్ర తర్వాత ఇప్పటివరకు అత్యధిక ఒమిక్రాన్ కేసులు నమోదైంది ఢిల్లీలోనే. దేశంలోని 23 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి.

మరోవైపు,దేశంలో మళ్లీ కోవిడ్ విజృంభిస్తోన్న వేళ పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల లోపు పిల్లలకు ఇవాళ్టి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇప్పటివరకు 12 లక్షల మంది పిల్లలు వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కోవిన్ యాప్ డేటా తెలియజేస్తోంది. ఇక,వ్యాక్సినేషన్ సెంటర్లుగా స్కూల్స్,కాలేజీలు,హెల్త్ సెంటర్స్ ను ఉపయోగిస్తున్నారు అధికారులు.

ALSO READ TDP chief Chandrababu: గుంటూరు దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై డీజీపీకి చంద్రబాబు లేఖ

.