వాట్సాప్‌లో పెళ్లి పిలుపు.. గూగుల్‌ మ్యాప్‌లో లొకేషన్‌.. ఫేస్‌బుక్‌లో లైవ్‌

వాట్సాప్‌లో పెళ్లి పిలుపు.. గూగుల్‌ మ్యాప్‌లో లొకేషన్‌.. ఫేస్‌బుక్‌లో లైవ్‌

online wedding invitations : పెళ్లి కొంతపుంతలు తొక్కుతోంది. టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. కరోనా కారణంగా..ఆన్ లైన్ వేదికలుగా పెళ్లి మండపాలు మారిపోతున్నాయి. టెక్నాలజీ సహాయంతో కొంత పుంతలు తొక్కుతున్న ఈ వివాహాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. సాఫ్ట్ వేర్ లను ఉపయోగించి..చాలా మంది ప్రీ వెడ్డింగ్ షూట్ జరిపి, వాటితోనే వీడియో రూపంలో బంధువులకు, మిత్రులకు ఆహ్వానం పంపుతున్నారు. ఒకవేళ పెళ్లి కార్డులు పంపిణీ చేసి క్యూ ఆర్ కోడ్ ను నిక్షిప్తం చేస్తున్నారు. ఆ కోడ్ ను స్కాన్ చేస్తే..వీడియో రూపంలో ఉన్న ఆహ్వానం, వేదిక, ప్రత్యక్ష ప్రసారాలు, తదితర వివరాలు తెలుసుకోవచ్చు.

కరోనా కారణంగా..చాలా మందిని ఆహ్వానించలేకపోతున్నారు. పిలిచినా..వెళ్లడానికి కొంతమంది సంశయిస్తున్నారు. ఈ క్రమంలో..టెక్నాలజీ ద్వారా..పెళ్లి తంతును మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఆన్ లైన్ లో వీక్షించి..నూతన వధూవరులను మనసారా దీవించండి..అంటూ పెళ్లింటి వారు కోరుతున్నారు. ఆహ్వానితులు వేదిక వద్దకు సులువుగా చేరుకొనేలా..గూగుల్ మ్యాప్ సహాయంతో..లోకేషన్ ను షేర్ చేస్తున్నారు. ఈ లోకేషన్ ఆధారంగా..పెళ్లికి హాజరు కావాల్సిన వారు సులువుగా చేరుకొనే ఛాన్స్ ఉంది.

ఆహ్వాన పత్రికలు, వాట్సాప్ సందేశాలలో గూగుల్ మ్యాప్ లోకేషన్ ను తప్పకుండా ఉంచుతున్నారు. ఇంకోవైపు…ముఖ్యమైన బంధువులు, స్నేహితులలో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేస్తున్నారు. నిశ్చితార్థం నుంచి మొదలుకుని పెళ్లి తంతు ముగిసే వరకు..ఎప్పటికప్పుడు సమాచారం అందులో పోస్టు చేస్తున్నారు. ప్రత్యేకంగా అందరూ ఒకేవిధమైన డ్రెస్ లు వేసుకోవడం, పెళ్లి ఫొటోలు షేర్ చేయడం వంటివి ఈ గ్రూప్ ల వేదికగా జరుగుతున్నాయి. పెళ్లి కుమార్తె మండపానికి చేరుకోవడం, మాంగళ్య ధారణ, బంధుమిత్రుల ఆశీర్వచనాలు, విందు భోజనాలు వరకు యూ ట్యూబ్, ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియాలో లైవ్ కవరేజ్ చేస్తున్నారు. లైవ్ లో చూస్తున్న వారు..వధూవరులను ఆశీర్వదిస్తున్నారు.