The Elephant Whisperers : ఆస్కార్ విన్నింగ్ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ నటులకు తమిళనాడు సీఎం కనుక..

ఈ ఏడాది ఆస్కార్స్ లో ఇండియన్ సినిమాలు సత్తా చాటాయి. 'నాటు నాటు', ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అందుకున్న మొదటి ఇండియన్ సినిమాలుగా చరిత్ర సృష్టించాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ రెండు చిత్రాల పై ప్రశంసలు జల్లు కురుస్తుంది. ఈ క్రమంలోనే 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' చిత్రంలో నటించిన నటులు తెలంగాణ ప్రభుత్వం నుంచి బహుమతులు అందుకున్నారు.

The Elephant Whisperers : ఆస్కార్ విన్నింగ్ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ నటులకు తమిళనాడు సీఎం కనుక..

oscar winning movie The Elephant Whisperers awarded by tamilnadu cm Stalin

The Elephant Whisperers : ఈ ఏడాది ఆస్కార్స్ లో ఇండియన్ సినిమాలు సత్తా చాటాయి. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ సాంగ్, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అందుకున్న మొదటి ఇండియన్ సినిమాలుగా చరిత్ర సృష్టించాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ రెండు చిత్రాల పై ప్రశంసలు జల్లు కురుస్తుంది. ప్రశంసలు మాత్రమే కాదు బహుమతులు కూడా అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్రంలో నటించిన నటులు తమిళనాడు ప్రభుత్వం నుంచి బహుమతులు అందుకున్నారు.

Naatu Naatu : వరల్డ్ టాప్ సింగర్ ‘రిహన్న’తో నాటు నాటు టీం.. కల నిజమైంది!

‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’లో కనిపించిన ఎలిఫెంట్ కేర్ టేకర్ బొమ్మన్ అండ్ బెల్లి దంపతులకు.. తమిళనాడు సీఎం స్టాలిన్ 2 లక్షల బహుమతి అందజేశారు. అలాగే ఎలిఫెంట్ కేర్ క్యాంపు లో వర్క్ చేసే 91 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 1 లక్ష ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అంతేకాదు ఆ వర్కర్స్ కోసం యకో ఫ్రెండ్లీ హోమ్స్ నిర్మించేందుకు రూ.9.1 కోట్లు మంజూరు చేశారు. అలాగే యనమలై టైగర్ రిజర్వ్ ఏరియాలో, కోయంబత్తూరు చావడిలో కొత్త ఎలిఫెంట్ క్యాంపులు నిర్మించేందుకు 5, 8 కోట్లు ప్రకటించారు.

Oscars95 : గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఆస్కార్ చూసిన వారి సంఖ్య 12% పెరిగింది.. కారణం అదేనా?

ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. ఒక అడవిలో చిన్న గ్రామంలో ఉండే ఓ వయసుమళ్ళిన జంట ఒక అనాథ ఏనుగు పిల్లని పెంచుకుంటుంది. ఆ ఏనుగు పిల్లతో వీరి అనుబంధం, అడవి, ప్రకృతితో అనుబంధం, ఆ ఏనుగు పిల్ల చేసే అల్లరి.. ఇలా ఆ ఏనుగు పిల్ల, ఆ జంట చుట్టూ కథ ఉంటుంది. ప్రకృతి, జంతువులతో మనుషుల బంధం గురించే ఈ కథ సారాంశం. ఇప్పటికే అనేక అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా.. తాజాగా ఆస్కార్ ని కూడా అందుకుంది. ఈ సినిమాకి కార్తిక్ గోన్సాల్వేస్ దర్శకత్వం వహించారు. ఆస్కార్ గెలుచుకున్న ఈ మూవీ చూడాలి అనుకుంటే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది చూసేయండి.