OTT Release: సరుకు సిద్ధం.. ఈ వారం ఓటీటీలో సినిమాలివే!

సంక్రాంతికి తగ్గేదే లే అన్నట్టు ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసేస్తున్నాయి ఓటీటీలు. పోటాపోటీగా కంటెంట్ ను అప్ లోడ్ చేసేందుకు రెడీ అయ్యాయి. ఈ వీక్ మంచి హాలిడే సీజన్ కావడంతో క్యాష్..

OTT Release: సరుకు సిద్ధం.. ఈ వారం ఓటీటీలో సినిమాలివే!

Ott Release

OTT Release: సంక్రాంతికి తగ్గేదే లే అన్నట్టు ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసేస్తున్నాయి ఓటీటీలు. పోటాపోటీగా కంటెంట్ ను అప్ లోడ్ చేసేందుకు రెడీ అయ్యాయి. ఈ వీక్ మంచి హాలిడే సీజన్ కావడంతో క్యాష్ చేసుకునేందుకు సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ చేయబోతున్నాయి ఓటీటీలు. ఈ వారం.. జనవరి 12న ఇంగ్లీష్, హిందీతో పాటూ సౌత్ లాంగ్వెజెస్ అన్నింటిలో స్ట్రీమింగ్ కాబోతుంది ఎటర్నల్స్. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచరస్ గా రెడీఅయిన ఈ మూవీ హాట్ స్టార్ వేదికగా రిలీజ్ అవుతోంది. గెమ్మా చాన్, కిట్ హారింగ్టన్, ఎంజిలినా జోలీ వంటి వారు నటించిన ఈ మూవీ గురించి ఇండియన్ స్మార్ట్ స్క్రీన్ యూజర్స్ బాగానే వెయిట్ చేస్తున్నారు.

Bollywood Star’s: రెండేళ్లుగా ఆడియన్స్ చూడని హీరోలు.. ఈ ఏడాదిపైనే ఆశలన్నీ!

సంక్రాంతికి హాట్ స్టార్ లో సందడి చేయబోతుంది పెళ్లి సందడి. కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోనంకి డైరెక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్స్ లో రిలీజై దానికి తగ్గ కలెక్షన్స్ రాబట్టింది. శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల రొమాంటిక్ జంటగా పేరుతెచ్చుకున్నారు. కీరవాణి మ్యూజిక్ పెళ్లిసందడికి ప్లస్సయింది. మరి ఓటీటీలో ఏమాత్రం ఆడుతుందో చూడాలి. హాట్ స్టార్ స్పెషల్ గా హ్యూమన్ సిరీస్ ను తీసుకురాబోతుంది. షెఫాలి షా లీడ్ రోల్ చేసిన ఈ సిరీస్ యాక్షన్ క్రైమ్ మిస్టరీగా రాబోతుంది. జనవరి 14న హ్యూమన్ హాట్ స్టార్ ఎంట్రీ ఇవ్వనుంది.

Ram Charan: శ్యామ్ దర్శకుడితో చెర్రీ.. ఇది కూడా యూనివర్సల్ కాన్సెప్టే!

నెట్ ఫ్లిక్స్ కూడా సరుకు గట్టిగానే సిద్ధం చేసింది. జనవరి 13న ఇంగ్లీష్ మిస్టరీ బ్రజెన్ స్ట్రీమింగ్ కాబోతుంటే జనవరి 14న సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ ఆర్కివ్ 81తో పాటూ యే కాలీ కాలీ అంఖేన్ క్రైమ్ డ్రామా రిలీజ్ ఉంది. శ్వేతా త్రిపాఠి, తాహిర్ రాజ్ జంటగా నటించిన ఈ మూవీ హిందీతో పాటూ తెలుగు, తమిళ్ బాషల్లో కూడా స్ట్రీమింగ్ కాబోతుంది.

Bangarraju: అక్కినేని హీరోల దూకుడుకి బ్రేకేసిన కోవిడ్..!

క్రష్ డ్… పూతమ్ పూదు కాలై విదియాద వంటి వాటితో అమెజాన్ రెడీ అయింది. లేటెస్ట్ రిలీజ్ పుష్పతోనే సంక్రాంతిని నడిపిద్దామనేది ప్రైమ్ ప్లాన్. బుక్ మై షో యాప్.. ఘోస్ట్ బస్టర్స్ ను తీసుకొస్తుంది. వూట్ లో రంజిష్ హై సాహి రిలీజ్ కాబోతుంది. జీ5లో గరుడ గమన వృషభ వాహన సినిమాను.. జనవరి 14 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కన్నడ డ్రామాగా రాబోతుంది ఈ మూవీ.