Anti-India Fake News : పాకిస్తాన్‌కు చెందిన 60 సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేశాం : కేంద్రం

పాక్ సంబంధిత సోషల్ మీడియా అకౌంట్లలో 60 వరకు అన్నింటిని కేంద్రం బ్లాక్ చేసినట్టు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది.

Anti-India Fake News : పాకిస్తాన్‌కు చెందిన 60 సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేశాం : కేంద్రం

Over 60 Social Media Accoun

Anti-India Fake News : పాకిస్తాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్లలో భారత్‌కు వ్యతిరేకంగా విష ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. గత రెండు నెలల్లో పలు యూట్యూబ్ ఛానెల్‌లు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలతో సహా 60కి పైగా సోషల్ మీడియా అకౌంట్లు పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నాయి. పాక్ సంబంధిత ఈ సోషల్ మీడియా అకౌంట్లలో యాంటీ ఇండియా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాయి.

పాక్ సంబంధిత సోషల్ మీడియా అకౌంట్లలో 60 వరకు అన్నింటిని కేంద్రం బ్లాక్ చేసినట్టు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ చెప్పారు. అంతేకాదు.. వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛపై ప్రభుత్వం చాలా శ్రద్ధ వహిస్తోందని రాజ్యసభలో అన్నారు. తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న వారిపై, దేశ వ్యతిరేక విషయాలను ప్రచురించే వారిపై చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

60 వరకు సోషల్ మీడియా అకౌంట్లలో ట్విట్టర్, యూట్యూబ్ ఛానళ్లు, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సహా 60 అకౌంట్లను బ్లాక్ చేసినట్టు మురుగన్ చెప్పారు. ఈ యూట్యూబ్ ఛానెల్‌లు పాకిస్తాన్ నుంచి నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భార‌త ప్ర‌భుత్వంపై ఆ ఛాన‌ళ్లు ఫేక్ న్యూస్ ప్ర‌చారం చేస్తున్న‌ట్లు మంత్రి మురుగన్ ఆరోపించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జ‌ర్న‌లిస్టుల ఎథిక‌ల్ కోడ్‌కు సంబంధించిన మంచి చెడుల‌ను పర్యవేక్షిస్తుందన్నారు. PCIలోని 14వ సెక్ష‌న్ ప్ర‌కారం.. అనైతికంగా వ్య‌వ‌హ‌రించే జ‌ర్న‌లిస్టుల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చునన్నారు.

ఆ సెక్ష‌న్ ప్ర‌కారం.. 150 మంది జ‌ర్న‌లిస్టుల‌పై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ఫేక్ న్యూస్ చెక్ చేసేందుకు ఫ్యాక్ట్ చెక్ (Fact check) యూనిట్‌ను స‌మాచార‌, ప్ర‌సార శాఖ‌లో ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. ఫేక్ వార్త‌లపై ఆ యూనిట్‌కు మెయిల్ లేదా లేఖ పంపవచ్చునని చెప్పారు. ఫేక్ న్యూస్‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు 13వేల కంప్లయింట్స్ వచ్చినట్టు తెలిపారు.

జనవరి 21న ప్రభుత్వం అధికారిక ప్రకటన ప్రకారం.. డిజిటల్ మీడియాలో సమన్వయంతో భారత వ్యతిరేక నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్న 35 యూట్యూబ్ ఆధారిత వార్తా ఛానెల్‌లు, రెండు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని ఆదేశించింది. అదనంగా, రెండు ట్విట్టర్ అకౌంట్లు, రెండు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, ఒక ఫేస్‌బుక్ అకౌంట్ బ్లాక్ చేశారు. డిసెంబర్‌లో కూడా 20 యూట్యూబ్ ఛానెల్‌లు, రెండు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసినట్లు అధికారిక ప్రకటన వెల్లడించింది.

Read Also : Semaglutide Drug : ప్రపంచానికి గుడ్‌న్యూస్.. అధిక బరువును తగ్గించే సరికొత్త డ్రగ్.. ఇదో గేమ్‌ఛేంజర్..!