Telugu » Latest News
పాఠాలు చెప్పడానికి స్టూడెంట్స్ ఎవరూ లేనప్పుడు.. శాలరీ ఎందుకని అనుకున్న ప్రొఫెసర్ 33నెలల జీతాన్ని తిరిగిచ్చేశాడు. స్టూడెంట్లకు పాఠాలు వినే ఆసక్తి లేదని తన రూ.23.8లక్షల జీతాన్ని రిటర్న్ చేయబోతుండగా అధికారులు నిరాకరించారు.
దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కొత్తగా 18,930 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 14,650 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వల్ల కొత్తగా 35 మరణాలు సంభవించాయి.
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇంటి వద్ద వర్షపు నీరు భారీగా నిలిచింది. దీంతో ముఖ్యమంత్రి ఇంటి ముందే పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజల ఇళ్ళ వద్ద ఎలా ఉంటుందని విమర్శలు వస్తున్నాయి.
గత కొద్ది కాలంగా పెరుగుతూ పోతున్న వంట నూనెల ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
భారత్‌తో పాటు పలు దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.2 ఉపరకం బీఏ.2.75 వ్యాప్తి జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ చెప్పారు. దాని వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు రేపు, ఎల్లుండి (జులై 8,9) గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదకాకానిలో జాతీయ రహదారి-16 వద్ద జరుగుతాయి.
భాష అనేది వాడుకను బట్టి మారిపోతుంది. జనరేషన్‌ను బట్టి దాని పద్ధతి కూడా మారిపోతుంది. ఈ టెక్నాలజీ యుగంలో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. దీంతో ఒరిజినల్ పదాలకు షార్ట్ కట్ లతో పాటు మరికొన్ని పదాలు వచ్చి చేరుతున్నాయి.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ న్యాయవాది హెచ్.సారస్వత్‌ను చంపేస్తామంటూ కొందరు దుండగులు ఓ లేఖ పంపారు. పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే సారస్వత్‌కు పడుతుందని ఆ లేఖలో హెచ్చరించారు. మూసేవాలా హత్య కేసులో ప్రధాన
పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు భగవంత్ మాన్ ఈరోజు వివాహం చేసుకోనున్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన దేశభక్తి ప్రతిబింబించేలా చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఉంటూ తన మనోభావాలను పంచుకునే ఆయన తాజాగా అమెరికాలో పర్యటిస్తూ ఓ ఫొటో షేర్ చేశారు. దానికి నెటిజన్ అడిగిన ఓ తుంటరి ప్రశ్నకు ఇ