Pakka Commercial: పక్కా కమర్షియల్.. ఇది నాన్-కమర్షియల్ అంటోన్న చిత్ర యూనిట్!
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పక్కా కమర్షియల్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది....

Pakka Commercial Movie To Be Released With Low Ticket Rates
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పక్కా కమర్షియల్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. అయితే ఈ సినిమాను జూలై 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
Pakka Commercial : డబ్బుల కోసమే పని చేసే లాయర్.. పక్కా కమర్షియల్ ట్రైలర్ రిలీజ్..
ఈ క్రమంలో ప్రస్తుతం సినిమా టికెట్స్ రేట్ల విషయంలో ‘పక్కా కమర్షియల్’ చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా వారు తెలిపారు. ఇటీవల సినిమా టికెట్లను విపరీతంగా పెంచుతూ ఆడియెన్స్‌పై భారం వేస్తున్న సినిమాలకు భిన్నంగా ‘పక్కా కమర్షియల్’ చిత్రాన్ని సాధారణ టికెట్ రేట్లకే రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాత బన్నీ వాస్ పేర్కొన్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు తమ కుటుంబంతో కలిసి చూసేందుకు వీలుగా, ఈ చిత్ర టికెట్ రేట్లు తక్కువగా ఉంచేందుకు తాము సిద్ధమయినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
Pakka Commercial: షూటింగ్ ముగించుకున్న పక్కా కమర్షియల్!
ఇక పక్కా కమర్షియల్ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో గోపీచంద్ పాత్ర చాలా హిలేరియస్‌గా ఉండనుండగా, ఆయన సరసన అందాల భామ రాశి ఖన్నా కూడా ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్రలో అదరగొట్టేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాలో సత్యరాజ్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమాను గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మరి పక్కా కమర్షియల్ అనే టైటిల్‌తో నాన్-కమర్షియల్‌గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే జూలై 1 వరకు వెయిట్ చేయాల్సిందే.