Whatsapp Download Documents : వాట్సాప్ ద్వారా మీ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను ఇలా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు!

Whatsapp Download Documents : ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో వాట్సాప్ ఒకటి. గత కొన్ని ఏళ్లుగా మెసేజింగ్ యాప్‌గా ఎంతో పాపులర్ అయింది. వీడియో కాల్‌లు, షాపింగ్ మరెన్నో సర్వీసులను పొందవచ్చు. WhatsApp చాట్‌బాట్ కూడా యూజర్ల మధ్య కమ్యూనికేషన్ టూల్‌గా మారింది.

Whatsapp Download Documents : వాట్సాప్ ద్వారా మీ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను ఇలా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు!

PAN Card, driving licence and other important documents you can download using WhatsApp

Whatsapp Download Documents : ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో వాట్సాప్ ఒకటి. గత కొన్ని ఏళ్లుగా మెసేజింగ్ యాప్‌గా ఎంతో పాపులర్ అయింది. వీడియో కాల్‌లు, షాపింగ్ మరెన్నో సర్వీసులను పొందవచ్చు. WhatsApp చాట్‌బాట్ కూడా యూజర్ల మధ్య కమ్యూనికేషన్ టూల్‌గా మారింది. మహమ్మారి సమయంలో కోవిడ్ సంబంధిత హెచ్చరికలు, సమాచారాన్ని పంపేందుకు వివిధ ప్రభుత్వ సంస్థలు WhatsAppను ఎక్కువగా ఉపయోగించాయి. వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ యూజర్లను కోవిడ్ సర్టిఫికేట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అనుమతిస్తుంది. అది మాత్రమే కాదు.. వాట్సాప్‌లో అనేక ఇతర ప్రభుత్వ డాక్యుమెంట్లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

PAN Card, driving licence and other important documents you can download using WhatsApp

PAN Card, driving licence and other important documents you can download using WhatsApp

MyGov అనేది వాట్సాప్‌లోని చాట్‌బాట్ ఆధారిత సర్వీసు. డిజిలాకర్‌ (DigiLocker)ని ఉపయోగించి వినియోగదారులు వివిధ ముఖ్యమైన డాక్యుమెంట్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ వంటి మరిన్నో డాక్యుమెంట్లు ఉన్నాయి. వాట్సాప్ యూజర్లు కొన్ని దశలను ఫాలో కావడం ద్వారా వాట్సాప్‌లోనే మీకు అవసరమైన ముఖ్యమైన డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అయితే ఈ డాక్యుమెంట్లను యూజర్ల డిజిలాకర్‌లో మాత్రమే Save చేయాలి. మీ డిజిలాకర్ అకౌంట్ వివరాలను ధృవీకరించాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డ్‌తో మీ వాట్సాప్ నంబర్‌ను అనుసంధానం చేయడం ఒకసారి మాత్రమే చేయాల్సి ఉంటుంది. అయితే యూజర్లు 6-అంకెల సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయడం ద్వారా డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో మీరు ఏయే కీలక డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం.

1. CBSE X Class మార్క్‌షీట్ పాస్ సర్టిఫికేట్ :
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విద్యార్థులు, వారి మార్క్ షీట్‌లు, పాస్ సర్టిఫికేట్‌లను వారి ఆధార్ కార్డ్‌తో లింక్ చేసిన విద్యార్థులు వాటిని వాట్సాప్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు వాట్సాప్‌లో డిజిలాకర్ యాక్సెస్‌ని సెటప్ చేసిన తర్వాత మీరు యాప్ నుంచి మార్క్‌షీట్, పాసింగ్ సర్టిఫికేట్ రెండింటినీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో MyGov చాట్ విండోను యాక్సెస్ చేసేందుకు 9013151515 నంబర్‌ను Save చేయండి. MyGov చాట్ విండోలోని నంబర్‌పై ‘Hi లేదా ‘DigiLocker’ లేదా ‘Namaste’ అని పంపండి. అప్పుడు మీకు Welcome Message వస్తుంది. మీ డిజిలాకర్ అకౌంట్ వివరాలను సమర్పించాలి. అప్పుడు, మీరు మీ ఆధార్ కార్డ్ నంబర్‌ను అందించాలి. మీ లింక్ చేసిన ఫోన్ నంబర్‌కు పంపిన OTPని ఎంటర్ చేయాలి. OTPని సమర్పించిన తర్వాత మీరు WhatsApp నుంచి మీ మార్క్‌షీట్, పాస్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ డిజిలాకర్‌లో Save చేయాల్సి ఉంటుంది.

PAN Card, driving licence and other important documents you can download using WhatsApp(1)

PAN Card, driving licence and other important documents you can download using WhatsApp

2. CBSE XII క్లాస్ మార్క్‌షీట్ :
మీరు MyGov చాట్ విండో క్లోజ్ చేసిన తర్వాత, లింక్ చేసిన డిజిలాకర్ అకౌంట్ ప్రధాన మెనూని యాక్సెస్ చేసేందుకు మీరు మళ్లీ ‘Hi’ అని పంపాలి. CBSE విద్యార్థులు వాట్సాప్‌లోని డిజిలాకర్ అకౌంట్ యాక్సెస్ నుంచి వారి 12వ తరగతి మార్క్‌షీట్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

PAN Card, driving licence and other important documents you can download using WhatsApp(

PAN Card, driving licence and other important documents you can download using WhatsApp

3. పాన్ కార్డ్ (Pan Card) :
MyGov చాట్ విండో కొత్తగా ఓపెన్ చేయండి. యూజర్లు మెయిన్ మెనూని యాక్సెస్ చేసేందుకు ‘Hi’ అని పంపాలి. వినియోగదారులు తమ పాన్ కార్డ్, ఇతర డాక్యుమెంట్లను ప్రధాన మెనూలో పొందవచ్చు. ప్రధాన మెనూలో, మీరు పాన్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

PAN Card, driving licence and other important documents you can download using WhatsApp

PAN Card, driving licence and other important documents you can download using WhatsApp

4. డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence) :
మీ పాన్ కార్డ్ మాదిరిగానే.. వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను నేరుగా వారి మొబైల్‌లలో యాక్సెస్ చేయవచ్చు. MyGov చాట్ విండోలో ‘Hi’ అని పంపండి. మీకు Welcome Message వస్తుంది. Welcome మెసేజ్‌లో ప్రధాన మెనూ ఆప్షన్‌పై Click చేయండి. మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు డ్రైవింగ్/రైడింగ్ చేస్తున్నప్పుడు మీ డ్రైవింగ్ లైసెన్స్ హార్డ్ కాపీలు లేకపోయినా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

5. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) :
వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) అనేది ట్రాఫిక్ పోలీసులు సాధారణంగా అడిగే మరో ముఖ్యమైన డాక్యుమెంట్.. మీరు మీ RC హార్డ్ కాపీ లేదని ఆందోళన అక్కర్లేదు. మీరు దానిని నేరుగా మీ WhatsAppలోనే పొందవచ్చు. మీరు మీ RCని పొందే ప్రధాన మెనూని యాక్సెస్ చేసేందుకు MyGov చాట్ విండోను ఎంటర్ చేసి ‘Hi’ని పంపండి. మీ డిజిలాకర్ అకౌంట్ మీ వాట్సాప్ నంబర్‌కు లింక్ అయితే మాత్రమే పని చేస్తుందని గుర్తించుకోండి.

PAN Card, driving licence and other important documents you can download using WhatsApp

PAN Card, driving licence and other important documents you can download using WhatsApp

6. బీమా పాలసీ డాక్యుమెంట్ :
వాట్సాప్ ద్వారా డిజిలాకర్ యూజర్లకు లైఫ్ (Life), వాహనం (Vehicle), మెడికల్ (Medical) ఇతర రకాల బీమా పాలసీల కోసం బీమా పాలసీ డాక్యుమెంట్లను యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తుంది. మీ WhatsApp ఓపెన్ చేసి లిస్టు నుంచి MyGov చాట్‌ని ఎంచుకోండి. ఇక్కడ ‘Hi’ అని టైప్ చేయండి. మీరు చాట్‌బాట్ నుంచి Welcome Message రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. (మీ డిజిలాకర్ అకౌంట్ WhatsAppతో లింక్ అయి ఉండాలి). Main Menu ఆప్షన్‌పై Click చేయండి మీరు కలిగిన వివిధ రకాల పాలసీలకు సంబంధించిన బీమా పాలసీ డాక్యుమెంట్‌లను పొందవచ్చు.

PAN Card, driving licence and other important documents you can download using WhatsApp

PAN Card, driving licence and other important documents you can download using WhatsApp

7. కోవిడ్ వ్యాక్సినేషన్ (Covid Vaccination) సర్టిఫికేట్ :
MyGov చాట్ విండోలో ‘Hi పంపిన తర్వాత మీకు Welcome Message రెండు ఆప్షన్లను అందిస్తుంది. అందులో Main Menu, కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. యూజర్ డిజిలాకర్ అకౌంట్ లింక్ చేసిన WhatsApp యూజర్లకు MyGov చాట్‌బాట్ పంపిన Welcome Message నుంచి నేరుగా వారి కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి Main Menu ఓపెన్ చేయాల్సిన అవసరం లేదని గుర్తించుకోవాలి.

PAN Card, driving licence and other important documents you can download using WhatsApp

PAN Card, driving licence and other important documents you can download using WhatsApp

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Indian Whatsapp Accounts Banned : 26 ల‌క్ష‌లకుపైగా భారతీయుల వాట్సాప్ ఖాతాలు నిషేధం