Parliament Session : మోదీపై టీఆర్ఎస్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

రాజ్యసభ చైర్మన్ కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ఇచ్చారు. రూల్ 187 కింద ప్రివిలేజ్ మోషన్ ఫిర్యాదు చేశారు.,.తెలంగాణ ఏర్పాటును కించపరిచేలా మోదీ వ్యాఖ్యలు...

Parliament Session : మోదీపై టీఆర్ఎస్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

Modi

Updated On : February 10, 2022 / 11:03 AM IST

TRS Vs BJP : ప్రధాన మంత్రి ఏపీ రాష్ట్ర విభజనపై మోదీ చేసిన కామెంట్స్ సెగలు పుట్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హీట్ పెంచుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు..మోదీపై విమర్శలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల విభజన అందరి అభిప్రాయాల మేరకు జరగలేదంటూ పార్లమెంట్ లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేతలు గుర్రుమంటున్నారు. ప్రధాని మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు తెలిపారు.

Read More : Mahesh Babu : 17 సంవత్సరాలు.. ఇదంతా ప్రేమతోనే.. మహేష్ పెళ్లిరోజు స్పెషల్ పోస్ట్..

అన్నట్లుగానే.. 2022, ఫిబ్రవరి 10వ తేదీ గురువారం రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ఇచ్చారు. ఈ సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు. రూల్ 187 కింద ప్రివిలేజ్ మోషన్ ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 8న రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటును కించపరిచేలా మోదీ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. పార్లమెంట్ కార్యకలాపాలను, చట్ట సభను దిగజార్చేలా, పార్లమెంట్ ప్రిసైడింగ్ అధికారులను అగౌరవ పరిచేలా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయని వెల్లడించారు.

Read More : Tollywood: టాలీవుడ్ ప్రముఖుల కోసం.. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు

పార్లమెంట్‌ వేదికగా ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని హడావుడిగా విభజించారంటూ ఆరోపించారు మోదీ. ఏపీ, తెలంగాణ వైషమ్యాలకు కాంగ్రెస్‌ పార్టీనే కారణమన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదన్న మోదీ.. విభజన కోసం అనుసరించిన పద్ధతి సరిగా లేదన్నారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదని మోదీ మండిపడ్డారు. ఏపీ, తెలంగాణ ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు ప్రధాని మోదీ. దీనిపై టీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన నేతలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి.