Paruchuri Gopalakrishna : ‘సన్ ఆఫ్ ఇండియా’ థియేటర్స్‌లో వద్దు ఓటీటీలో రిలీజ్ చేయమన్నాను.. మోహన్‌బాబు వినలేదు  

 గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ''మోహన్ బాబు తన 40 సంవత్సరాలకు పైగా ఉన్న సినీ జీవితంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలని, సందేశాత్మక చిత్రాలని అందించాడు. అదే తరహాలో గొప్ప సందేశంతో...............

Paruchuri Gopalakrishna : ‘సన్ ఆఫ్ ఇండియా’ థియేటర్స్‌లో వద్దు ఓటీటీలో రిలీజ్ చేయమన్నాను.. మోహన్‌బాబు వినలేదు  

Paruchuri

Son Of India :  కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా వచ్చిన ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా ఫిబ్రవరి 18న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా భారీ అపజయాన్ని మూట కట్టుకుంది. మొదటి రోజే అధికారికంగా థియేటర్లలో షోలు రద్దు చేశారు. సినిమాకి పెట్టిన పెట్టుబడిలో పావు వంతు కూడా రాలేదు. ఈ సినిమా బాగా ట్రోలింగ్ కి గురయింది. తాజాగా ఈ సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు.

పరుచూరి గోపాల కృష్ణ తన యూట్యూబ్ ఛానెల్ లో పరుచూరి పలుకులు అనే పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో సినిమాల గురించి, నటీనటుల గురించి విశేషణం ఇస్తూ ఉంటారు. తాజాగా మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా గురించి పరుచూరి గోపాల కృష్ణ తన ఛానెల్ లో మాట్లాడారు.

గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ”మోహన్ బాబు తన 40 సంవత్సరాలకు పైగా ఉన్న సినీ జీవితంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలని, సందేశాత్మక చిత్రాలని అందించాడు. అదే తరహాలో గొప్ప సందేశంతో ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాని చేశారు. నేను ఈ సినిమాని థియేటర్లలో వద్దు ఓటీటీలో రిలీజ్ చేయమని చెప్పాను. నా మాటని గౌరవించి ఈ సినిమాని థియేటర్లలో కాకుండా ఓటీటీలో రీలీజ్ చేయమని మోహన్ బాబుని రిక్వెస్ట్ కూడా చేసాను. కానీ మోహన్ బాబు నా మాట వినలేదు.”

Dhanush-Aishwarya : విడాకుల తర్వాత మొదటిసారి ఎదురుపడ్డ ధనుష్, ఐశ్వర్య.. ఒకే పార్టీలో ఇద్దరూ..

”మోహన్ బాబుతో అనుబంధం మాది ఈనాటిది కాదు. ఒకప్పుడు నేను, అన్నయ్య కలిసి డైలాగ్ లు రాసిన ‘అగ్నిజ్వాల’ సినిమాకు మమ్మల్ని తప్పించాడు. మేము వద్దని మమ్మల్ని తీసేసి మరో రచయితని పెట్టుకున్నారు మోహన్ బాబు. అయినా ఆ తర్వాత మళ్ళీ కలిసి అసెంబ్లీ రౌడీ, రౌడీగారి పెళ్లాం, బ్రహ్మ, అడవిలో అన్న లాంటి సూపర్ హిట్ సినిమాలకు పని చేశాం. మోహన్ బాబుతో కలిసి చరిత్ర సృష్టించిన సినిమాలకి పని చేసాం. ‘అసెంబ్లీ రౌడీ’ హిట్ అయ్యాక నా ఇంటికి వచ్చి నాకు గజమాల వేశాడు మోహన్ బాబు”

Nithin : ‘జూనియర్’గా నితిన్.. మరో సినిమా లైన్లో..

”మంచి డైలాగ్ డిక్షన్ ఉన్న మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’లో కూడా అదే స్థాయి డైలాగ్స్ చెప్పారు. ఇలాంటి సందేశాత్మక చిత్రాలని థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఇటీవల సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమాని థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేశారు. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయితే సూర్యని ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చదు. అందుకే సూర్య ‘జై భీమ్’ని ఓటీటీలో రిలీజ్ చేయడానికే ఇష్టపడ్డారు. అలాగే నేను చెప్పినట్లు ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాని కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తే బాగుండేది అని పరుచూరి తెలిపారు.