Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?

క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేశ్ గురించి గతకొంత కాలంగా సినీ వర్గాల్లో ఒకే వార్త తెగ చక్కర్లు కొడుతోంది. సీనియర్ నటుడు నరేశ్‌తో ఆమె రిలేషన్‌లో ఉందనే వార్తలు....

Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?

Pavitra Lokesh Clarifies About Her Relation With Actor Naresh

Updated On : July 1, 2022 / 8:12 PM IST

Pavitra Lokesh: క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేశ్ గురించి గతకొంత కాలంగా సినీ వర్గాల్లో ఒకే వార్త తెగ చక్కర్లు కొడుతోంది. సీనియర్ నటుడు నరేశ్‌తో ఆమె రిలేషన్‌లో ఉందనే వార్తలు ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ జోరుగా వినిపించాయి. అయితే తాజాగా బెంగుళూరుకు చెందిన ఓ ఛానల్‌కు నరేశ్ మూడో భార్య అయిన రమ్య రఘుపతి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవిత్రా ప్రస్తావన తీసుకురావడంతో ఇప్పుడు మరోసారి ఈ నటి వార్తల్లో నిలిచింది. పవిత్రా లోకేశ్‌తో సంబంధం పెట్టుకున్న తన భర్త ఆమెను పెళ్లి చేసుకున్నాడని.. అందుకే తనకు విడాకుల నోటీసు పంపించాడని రమ్య రఘుపతి ఆరోపణలు చేసింది.

Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!

తాజాగా ఈ వివాదంపై నటి పవిత్రా లోకేశ్ స్పందించింది. తాను తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటిస్తున్నానని.. తెలుగులో యాక్టర్ నరేశ్‌తో కలిసి పలు సినిమాల్లో నటించిన సందర్భంలో ఆయనతో మంచి స్నేహం ఏర్పడిందని.. ఆయన మంచి మనిషి మాత్రమే కాదని.. ఓ మంచి ఫ్రెండ్ అంటూ పవిత్రా చెప్పుకొచ్చింది. అయితే నరేశ్ ఉండేది హైదరాబాద్‌లో అని.. ఆయనతో తనకు ఎదైనా ఇబ్బంది ఉంటే రమ్య అక్కడ తేల్చుకోవాలని.. ఇలా బెంగుళూరు మీడియాలో తనపై ఆరోపణలు చేయడం తనను చాలా బాధించిందని పవిత్రా చెప్పుకొచ్చింది.

అయితే ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఒకవేళ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉంటే అది ఖచ్చితంగా కుటుంబ సభ్యుల మధ్యలోనే తేల్చుకుంటానని.. ఇలా పరువు తీసుకునే పనులు మాత్రం చేయనని ఆమె చెప్పుకొచ్చింది. ఇలా బెంగుళూరు మీడియాలో తనను తప్పుడు వ్యక్తిగా ప్రెజెంట్ చేసిన రమ్య రఘుపతి తన పద్ధతి మార్చుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరింది. ఇలాంటి సమయంలో తనకు, నరేశ్ గారికి అండగా నిలిచిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపింది.