Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!

గతకొంత కాలంగా టాలీవుడ్ వర్గాల్లో ఓ సీనియర్ జంట గురించి పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వారే.. సీనియర్ నటుడు నరేశ్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్....

Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!

Actor Naresh Gives Clarity On Pavithra Lokesh Issue

Naresh: గతకొంత కాలంగా టాలీవుడ్ వర్గాల్లో ఓ సీనియర్ జంట గురించి పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వారే.. సీనియర్ నటుడు నరేశ్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్. వీరిద్దరూ ఎక్కడికైనా కలిసి వెళ్లడాన్ని కేవలం టాలీవుడ్ మీడియానే కాకుండా సౌత్‌లోని అన్ని మీడియా ఛానల్స్ హాట్ టాపిక్ చేశాయి. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందనే టాక్ జోరుగా ప్రచారంలోకి వచ్చింది. అయితే నటుడు నరేశ్ మూడో భార్య అయిన రమ్య రఘుపతి తాజాగా కన్నడ మీడియాలో పలు వివాదాస్పద కామెంట్స్ చేసింది.

Naresh : కోట్లలో మోసం.. మాజీ భార్యపై పోలీసు కేసు.. నాకేం సంబంధం లేదు అంటున్న నరేష్..

ఆమె చేసిన కామెంట్స్‌పై తాజాగా నరేశ్ వివరణ ఇచ్చారు. గతకొద్ది రోజులుగా తాను పవిత్రా లోకేశ్‌తో ఏదో సంబంధం పెట్టుకుంటున్నట్లుగా వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లే. పవిత్రా లోకేశ్ తనకు ఓ మంచి స్నేహితురాలు. ఆమె తనకు ఓ గైడ్, ఫిలాసఫర్ అని నరేశ్ చెప్పుకొచ్చారు. తాను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు తనను అర్థం చేసుకుని పలకరించిన వ్యక్తి పవిత్రా అంటూ నరేశ్ చెప్పారు. ఇక తన భార్య రమ్య రఘుపతిపై నరేశ్ ఈ సందర్భంగా మండిపడ్డారు. ఆమె తనను సాధించాలని చూస్తుందని.. అందుకే పవిత్రా లోకేశ్ పేరును తెరపైకి తీసుకొస్తుందని నరేశ్ అన్నారు. ఆమె బెంగుళూరులో ఓ ఛానల్‌తో కలిసి తనపై వదంతులు సృష్టించి తన పరువుకు భంగం కలిగిస్తుందని నరేశ్ అన్నారు.

50 లక్షల కోసం ఇంట్లో వాళ్ళని పీడించిన రమ్య రఘుపతికి విడాకుల నోటీసు పంపి నెల అవుతుందని..విడాకుల నోటీసు పంపిన తర్వాత తనకు పెళ్లి కాబోతుందని ఆమె రూమర్స్ క్రియేట్ చేసిందని.. అయినా తానేమీ తప్పు చేయలేదు కాబట్టే కన్నడ మీడియాలో ఆ అంశంపై పూర్తి వివరణ ఇచ్చాను అని నరేశ్ అన్నారు. పవిత్రా లోకేశ్ ఆలోచనలు, తన ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయని, అందుకే ఆమెతో ఎక్కువ సమయం గడిపేందుకు తాను ఇష్టపడతానంటూ నరేశ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నరేశ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.