Naresh : కోట్లలో మోసం.. మాజీ భార్యపై పోలీసు కేసు.. నాకేం సంబంధం లేదు అంటున్న నరేష్..

 సీనియర్ నటుడు నరేష్‌ మాజీ భార్య రమ్య రఘుపతిపై డబ్బులు వసూలు చేస్తోందంటూ గచ్చిబౌలి పోలిస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. నటుడు నరేష్‌ మాజీ భార్య రమ్య రఘుపతి............

Naresh :  కోట్లలో మోసం.. మాజీ భార్యపై పోలీసు కేసు.. నాకేం సంబంధం లేదు అంటున్న నరేష్..

Naresh

Naresh :  సీనియర్ నటుడు నరేష్‌ మాజీ భార్య రమ్య రఘుపతిపై డబ్బులు వసూలు చేస్తోందంటూ గచ్చిబౌలి పోలిస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. నటుడు నరేష్‌ మాజీ భార్య రమ్య రఘుపతి మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె. తొమ్మిదేళ్ల క్రితం వీరికి వివాహమైంది. కానీ ఆ తర్వాత విడిపోయారు. ఇటీవల నరేష్‌ తో సహా ఆయన కుటుంబంతో దిగిన ఫోటోలను చూపించి, నరేష్‌కు చెందిన ఆస్తులను తన ఆస్తులుగా చెప్పి కొందరు మహిళల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు, అధిక వడ్డీలు, రిజిస్ట్రేషన్ల పేరుతో కోట్లల్లో మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదులు వచ్చాయి.

 

రమ్య కోట్లలో మోసానికి పాల్పడిందని, చాలా మందిని మోసం చేసిందని గచ్చిబౌలి పోలిస్‌ స్టేషన్‌లో కొంతమంది బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం బయటపడింది. అయితే రమ్య ఇలా చేయడంతో నటుడు నరేష్ కు వరుసగా కాల్స్ వెళ్తున్నాయి. నరేష్ కి ఈ విషయం గురించి తెలిసి ఈ వివాదంపై స్పందించాడు.

Bheemla Nayak : పవన్ కళ్యాణ్ చదివిస్తా అన్నారు : పవన్ కారవాన్ అసిస్టెంట్

ఈ వివాదంపై నరేష్ మాట్లాడుతూ.. ”రమ్య రఘుపతి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చేందుకే మీ ముందుకు వచ్చాను. ఈ వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇలా జరిగిందనే విషయం నాకు ఇటీవలే తెలిసింది. ఆమె గురించి తెలిసే నేను ఆమెతో విడిపోయాను. ప్రస్తుతం మా ఇద్దరికీ ఎలాంటి సంబంధం లేదు. ఇటీవల ఆమె ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇలాంటి వార్తలు రావడంతో మూడు నెలల క్రితమే పత్రికల్లో నేను ఓ పబ్లిక్‌ నోటీస్‌ కూడా ఇచ్చాను. రమ్యకి సంబంధించిన ఆర్థికపరమైన, ఏ ఇతర అంశాల్లోనూ రమ్యతో నాకు కానీ, నా బంధువులకు కానీ ఎలాంటి సంబంధం లేదని ఆ నోటీస్‌లో తెలిపాను. గత రెండు మూడు రోజులుగా పలువురు బాధితులు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. దాంతో పోలీసుల నుంచి నాకు ఫోన్స్‌ వస్తున్నాయి. ఈ మోసాల గురించి నాకు తెలియదని, కానీ ఈ విషయంలో నాకు చేతనైనంత సాయం చేస్తానని పోలీసులకు చెప్పాను. మరోసారి అందరికి చెబుతున్నాను… నాకూ, నా కుటుంబానికి రమ్య విషయంలో, ఆమె చేసే పనుల విషయంలో ఎలాంటి సంబంధం లేదు.’’ అని నరేశ్‌ తెలిపారు..