Vakeel Saab Movie : గద్వాలలో పవన్ ఫ్యాన్స్ వీరంగం, థియేటర్ తలుపులు ధ్వంసం

గద్వాల జిల్లాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. శ్రీనివాస టాకీస్ లో ‘వకీల్ సాబ్’ మూవీ 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం రిలీజ్ అయ్యింది.

Vakeel Saab Movie : గద్వాలలో పవన్ ఫ్యాన్స్ వీరంగం, థియేటర్ తలుపులు ధ్వంసం

Gadwal

Updated On : April 9, 2021 / 11:08 AM IST

Pawan Fans : గద్వాల జిల్లాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. శ్రీనివాస టాకీస్ లో ‘వకీల్ సాబ్’ మూవీ 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం రిలీజ్ అయ్యింది. అయితే..మూవీకి అంతరాయం ఏర్పడడంతో అభిమానులకు సహించలేకపోయారు. టాకీస్ వద్ద ఆందోళన చేశారు. థియేటర్ తలుపులను ధ్వంసం చేశారు. కుర్చీలను పలుగొట్టారు. అభిమానుల కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఆస్తినష్టం వాటిల్లినా..థియేటర్ యాజమాన్యం స్పందించింది. మొదటి నుంచి మూవీ ప్రదర్శిస్తామని చెప్పడంతో అభిమానులు శాంతించారు. దీంతో అప్పటి వరకు కొనసాగిన ఉద్రిక్తత వాతావరణం చల్లబడడంతో ఊపిరిపీల్చుకున్నారు.

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అంటే ప్రాణాలిచ్చే అభిమానులు లక్షల్లో ఉంటారు. అంతగా ఆయన్ని ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే పిచ్చిగా ఇష్టపడతారు. పవన్‌ అంటే ఓ వ్యసనం అని చెబుతుంటారు బండ్ల గణేష్‌ లాంటి అభిమానులు. అలాంటి అభిమాన హీరో మూడేళ్ల తర్వాత సినిమా చేస్తే, ఓ పవర్‌ ఫుల్‌ సందేశాత్మక చిత్రంతో వస్తే ఇక థియేటర్లలో పూనకమే. బాక్సాఫీస్‌ షేక్‌ కావాల్సిందే.

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా, శృతి హాసన్‌ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. `ఎంసీఏ` ఫేమ్‌ వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం విడుదలయ్యింది. హిందీ `పింక్‌` రీమేక్ గా రూపొందించిన ఈ సినిమా యూఎస్‌, దుబాయ్‌ వంటి దేశాల్లో ఒక్క రోజు ముందే ప్రీమియర్ షోస్‌ పడ్డాయి. ఏపీ, తెలంగాణలోనూ మార్నింగ్‌ నాలుగు గంటల నుంచే బెనిఫిట్‌ షోస్‌ పడ్డాయి. థియేటర్లలో సందడి ఎర్లీ మార్నింగ్‌ నుంచే ప్రారంభమైంది.

 

Read More : Pawan Kalyan : వకీల్ సాబ్ వచ్చేశాడు..అభిమానులు ఫుల్ ఖుష్.