Pawan Kalyan : పవన్ కళ్యాణ్ లగ్జీరియస్ కార్.. కాస్ట్ ఎంతంటే..!

పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా ఓ లగ్జీరియస్ ఎస్‌యూవీ వెహికల్ కొన్నారనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ లగ్జీరియస్ కార్.. కాస్ట్ ఎంతంటే..!

Pawan Kalyan Buys A Costly Suv Range Rover 3 0

Updated On : July 1, 2021 / 5:51 PM IST

Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు, ఏ కొత్త అప్‌డేట్ వస్తుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు వీరాభిమానులు. క్రిష్ డైరెక్షన్‌లో పవన్ చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ తర్వాత తమ హీరోకి సంబధించి కొత్త న్యూస్ ఏదీ బయటకి రావట్లేదేంటబ్బా అనుకుంటున్న అభిమానులకి ఓ గుడ్ న్యూస్ తెలిసింది.

పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా ఓ లగ్జీరియస్ ఎస్‌యూవీ వెహికల్ కొన్నారనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఎస్‌యూవీ రేంజ్ రోవర్ 3.0 మోడల్ న్యూ కార్ ఆర్డర్ చేశారట పవర్‌స్టార్.. దాని కాస్ట్ అక్షరాలా 4 కోట్లు. అద్భుతమైన ఫీచర్స్‌తో, స్టైలిష్ అండ్ రాయల్‌గా ఉండే ఈ కార్‌లో పీకే ఎప్పుడు కనిపిస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

Hari Hara Veera Mallu : యాక్షన్ సీన్ లీక్..!

ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ 27వ సినిమా ‘హరి హర వీరమల్లు’ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. తర్వాత రానాతో కలిసి మలయాళీ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌లోనూ నటిస్తున్నారు. తర్వాత ‘గబ్బర్ సింగ్’ హరీష్ శంకర్‌తో సినిమా చెయ్యబోతున్నారు పవన్ కళ్యాణ్.