Pawan Kalyan OG : పుణేలో పవన్ OG షూటింగ్.. సాంగ్ షూట్ జరుగుతుందా?

ముంబైలో ఇటీవల మొదలైన OG మూవీ షూటింగ్ పరుగులు పెడుతుంది. తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్..

Pawan Kalyan OG : పుణేలో పవన్ OG షూటింగ్.. సాంగ్ షూట్ జరుగుతుందా?

Pawan Kalyan OG new schedule starts at pune with Priyanka Mohan

Updated On : May 3, 2023 / 9:39 PM IST

Pawan Kalyan OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు షూటింగ్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన పవన్.. ఆ వెంటనే They Call Him OG సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సాహూ ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ గ్యాంగ్ స్టార్స్ నేపథ్యంతో తెరకెక్కుతుంది. RRR నిర్మించిన డివివి దానయ్య ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ముంబైలో ఇటీవల మొదలైన ఈ మూవీ షూటింగ్ పరుగులు పెడుతుంది. పవన్ పై యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించినట్లు తెలుస్తుంది.

Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ షెడ్యూల్ షురూ.. యాక్షన్ పార్ట్!

తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యినట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ (మే 3) పుణేలో మొదలైన కొత్త షెడ్యూల్ లో పవన్ అండ్ ప్రియాంక పాల్గొన్నారు. అందమైన ప్రకృతి ప్రదేశంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నట్లు నిర్మాత తెలియజేశాడు. అందమైన ప్రకృతిలో హీరోహీరోయిన్లతో షూటింగ్ అంటే సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు ఏమో అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Pawan Kalyan OG : పవన్ అభిమానికి OG నిర్మాత డివివి బిర్యానీ పార్సిల్‌.. ఫోటో వైరల్!

ఇక పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ షెడ్యూల్ కూడా మొదలు కాబోతున్నట్లు ఆ చిత్ర యూనిట్ తాజాగా ట్వీట్ చేసింది. దీంతో రెండు మూడు రోజుల్లో OG షూట్ పూర్తి చేసి ఉస్తాద్ సెట్స్ లోకి పవన్ షిఫ్ట్ అవ్వబోతున్నాడని తెలుస్తుంది. ఉస్తాద్ సెకండ్ షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించబోతున్నట్లు ప్రకటించారు. ఈ రెండు చిత్రాలను త్వరగా పూర్తి చేసేసి మే చివరి నుంచి హరి హర వీరమల్లు షూటింగ్ లో పవన్ జాయిన్ కానున్నాడని సమాచారం.