Pawan Kalyan : 2024 ఎన్నికలకి పక్కా ప్లాన్.. ఒక్కో సినిమాకి 60 రోజులు మాత్రమే డేట్స్..

2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉండటంతో ఈ సారి వాటిపై పూర్తిగా దృష్టి సారించాలని, ఒక సంవత్సరం ముందు నుంచే పూర్తిగా రాజకీయాల్లో నిమగ్నమవ్వాలని భావిస్తున్నారు ఈ జనసేనాని. 2023 లోపే....

Pawan Kalyan :  2024 ఎన్నికలకి పక్కా ప్లాన్.. ఒక్కో సినిమాకి 60 రోజులు మాత్రమే డేట్స్..

Pawan Kalyan

Updated On : January 25, 2022 / 7:35 AM IST

Pawan Kalyan :   పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. ఒకపక్క సినిమాలు, మరోపక్క రాజకీయాలతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ నడుస్తుండటంతో షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చారు. అటు రాజకీయాల్లో మాత్రం బిజీగా ఉన్నారు. ఇప్పటికే పవన్ వరుసగా 4 సినిమాలకు సైన్ చేశారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉండటంతో ఈ సారి వాటిపై పూర్తిగా దృష్టి సారించాలని, ఒక సంవత్సరం ముందు నుంచే పూర్తిగా రాజకీయాల్లో నిమగ్నమవ్వాలని భావిస్తున్నారు ఈ జనసేనాని.

2023 లోపే ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. కరోనా లేకపోతే పవన్ అనుకున్నట్టు అన్ని ప్లాన్ ప్రకారం జరిగేవి. తాజాగా తన సినిమా నిర్మాతలకి, డైరెక్టర్స్ కి కేవలం సినిమాకి 60 రోజులు మాత్రమే షూటింగ్ కి కేటాయిస్తానని తెలిపాడట. అంటే ఒక్కో సినిమాకి కేవలం రెండు నెలలు షూటింగ్ కి కేటాయిస్తాను అని తెలిపాడు పవర్ స్టార్. ఈ 60 రోజుల్లో తనతో ఉన్న సీన్స్ అన్ని పూర్తి చేసుకోవాలని కండిషన్ పెట్టాడట. మళ్ళీ డబ్బింగ్ కి తప్ప షూటింగ్ కి వచ్చే ప్రసక్తి లేదని తెలిపాడు పవన్. ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్స్ పవన్ డేట్స్ ని బేస్ చేసుకొని మిగతా ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ చేయాలి. ఇది చాలా పెద్ద పని. చూడాలి మరి ఈ షూటింగ్స్ ఎంతవరకు అవుతాయో.

Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష సోదరుడికి యాక్సిడెంట్.. వాళ్ళ వల్లే అంటూ ఎమోషనల్ పోస్ట్..

పవన్ ప్లాన్ ప్రకారం ఫిబ్రవరి నుంచి షూటింగ్స్ మొదలు పెట్టి ఈ సంవత్సరం చివరికి అన్ని సినిమాలు షూటింగ్స్ కంప్లీట్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడు పవన్. ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది కాబట్టి దీనికి ఎక్కువ డేట్స్ కేటాయించే పని ఉండదు. ఒక నెల రోజులు కేటాయించే అవకాశం ఉంది. ఇక హరీశ్‌ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలోని సినిమాలు ఇప్పటికి షూటింగ్ కూడా ప్రారంభించలేదు. ‘హరిహర వీరమల్లు’ సినిమా తర్వాత ఈ రెండు సినిమాలకి డేట్స్ కేటాయించనున్నారు పవన్.

BiggBoss Vishwa : బిగ్‌బాస్ విశ్వ హోమ్ టూర్.. ఇంటి అడ్రస్ కూడా చెప్పేశాడుగా..

ఒకే సంవత్సరంలో ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ అన్ని కంప్లీట్ చేస్తే వరుసగా సినిమాలు రిలీజ్ అవుతాయి. ఇది పవన్ కి కూడా ప్లస్ అవుతుంది. ఇన్నాళ్లు పవన్ లేట్ గా సినిమాలు చేస్తున్నారని అభిమానులు బాధపడుతున్నారు. ఈ నిర్ణయంతో పవన్ నుంచి వరుసగా సినిమాలు వస్తాయి కాబట్టి అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.