Paytm CEO : పేటీఎం సీఈవో హైస్కూల్ నుంచి 2 పుస్తకాలు మాత్రమే చదివారట.. అవేంటంటే..

పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మకు పుస్తక పఠనం పట్ల పెద్దగా ఆసక్తి లేదట. స్కూలు చదువుల నుంచి ఇప్పటివరకే కేవలం రెండే పుస్తకాలు చదివానని ట్వీట్ చేశారు. పుస్తకాలు చదవడంలో తను చాలా బ్యాడ్ అంటూ ఆయన షేర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Paytm CEO : పేటీఎం సీఈవో హైస్కూల్ నుంచి 2 పుస్తకాలు మాత్రమే చదివారట.. అవేంటంటే..

Paytm CEO

Viral News : పేటీఎం సీఈవో స్కూల్ లైఫ్ నుంచి 2 పుస్తకాలు మాత్రమే చదివారట.. స్వయంగా ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. పుస్తకాలు చదవడంలో తను చాలా బ్యాడ్ అంటూ ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Tech Tips in Telugu : గూగుల్ పే, పోన్‌పే, పేటీఎంతో UPI పేమెంట్స్ చేస్తున్నారా? ఈ 5 సేఫ్టీ టిప్స్ తప్పక పాటించండి..!

ఎంత పెద్ద వ్యాపారవేత్తలైనా.. సెలబ్రిటీలైన కొందరికి పుస్తక పఠనం హాబీగా ఉంటుంది. పుస్తకాలు చదివి చాలా నేర్చుకున్నాం అని చెబుతూ ఉంటారు. అయితే పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ రీసెంట్‌గా తను పుస్తకాలు చదవడంలో చాలా బ్యాడ్ అంటూ ట్వీట్ చేశారు. హైస్కూలు చదువుల నుంచి తన వద్ద రెండే పుస్తకాలు ఉన్నాయని చెప్పారు. వాస్తవానికి @DeepWisdom అనే ట్విట్టర్ ఖాతాదారు 45 సంవత్సరాల లోపు చదవాల్సిన 10 పుస్తకాలు అంటూ షేర్ చేసిన ట్వీట్‌కు విజయ్ శేఖర్ శర్మ రిప్లై చేస్తూ ట్వీట్ పెట్టారు.

 

‘నాకు పుస్తకాలు చదవడంలో పెద్దగా ఆసక్తి లేదు. ఇప్పుడు నా వయసు 45 దాటింది. ‘సైకాలజీ ఆఫ్ మనీ’ అనే పుస్తకంలో కొన్ని చాప్టర్స్ మాత్రమే చదివాను. అలాగే 12వ తరగతి చదువుతున్నప్పుడు ‘స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీ’ మరియు ‘స్ట్రెయిట్ ఫ్రమ్ గట్’ అనే రెండు పుస్తకాలు చదివాను. ఈ అద్భుతమైన పుస్తకాలు చదవండి. నేను స్కూల్ లో చదువుతున్నప్పుడు నా సబ్జెక్టులకు సంబంధం లేని నా సిస్టర్స్ బి.ఎ/ఎం.ఎ పుస్తకాలు ఆసక్తిగా చదివేవాడిని’ అంటూ విజయ్ శేఖర్ శర్మ తన ట్విట్టర్ అకౌంట్లో (@vijayshekhar) షేర్ చేశారు.

Tech Tips in Telugu : పేటీఎం, పోన్‌పే వ్యాలెట్ నుంచి నగదును బ్యాంకు అకౌంట్లకు ఎలా పంపాలో తెలుసా? ఇదిగో సింపుల్ టిప్స్..!

‘ఆడియో బుక్స్ లేదా వీడియో పుస్తకాలను వినడానికి ప్రయత్నించండి.. వందలాది పుస్తకాల నుండి నేర్చుకోవడంలో సహాయపడుతుంది’ అని ఒకరు.. ‘మీరు ఇష్టపడేదాన్ని చదవండి.. మీరు చదవడానికి ఇష్టపడేంతవరకూ’ అంటూ మరొకరు అంటూ వరుసగా అభిప్రాయాలు పోస్ట్ చేశారు.