Planes secured at Ahmedabad airport: తీరం దాటిన తుపాన్, అహ్మదాబాద్ విమానాశ్రయంలో విమానాలు సురక్షితం

బిపర్‌జోయ్ తుపాన్ గుజరాత్ తీరం దాటిన తర్వాత అహ్మదాబాద్ విమానాశ్రయంలోని విమానాలు సురక్షితంగా ఉన్నాయి (Planes secured) అహ్మదాబాద్ లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిన్న విమానాలను ముందుజాగ్రత్తగా లోపల ఉంచారు. పెద్ద విమానాలను విమానాశ్రయంలోనే పార్కింగ్ చేసి వాటికి అదనంగా బ్రేకులు అమర్చారు....

Planes secured at Ahmedabad airport: తీరం దాటిన తుపాన్, అహ్మదాబాద్ విమానాశ్రయంలో విమానాలు సురక్షితం

విమానాలు సురక్షితం

Planes secured at Ahmedabad airport: బిపర్‌జోయ్ తుపాన్ గుజరాత్ తీరం దాటిన తర్వాత అహ్మదాబాద్ విమానాశ్రయంలోని విమానాలు సురక్షితంగా ఉన్నాయి (Planes secured) అహ్మదాబాద్ లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిన్న విమానాలను ముందుజాగ్రత్తగా లోపల ఉంచారు. పెద్ద విమానాలను విమానాశ్రయంలోనే పార్కింగ్ చేసి వాటికి అదనంగా బ్రేక్ అమర్చారు. భారీ గాలుల వల్ల విమానాలు కదలకుండా విమానాశ్రయ అధికారులు చర్యలు తీసుకున్నారు.

Cyclone Biparjoy To Reach Rajasthan: రాజస్థాన్‌కు మళ్లిన బిపర్‌జోయ్ తుపాన్..నేడు భారీ వర్షాలు

దీంతోపాటు విమానాశ్రయంలో తుపాన్ వల్ల ఏర్పడే అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో 43 విమానాలను పార్కింగ్ స్టాండ్లలో ఉంచారు. తుపాన్ ప్రభావం వల్ల ఢిల్లీ, ముంబయిలకు వెళ్లే విమానాలు 30 నిమిషాల నుంచి రెండు గంటల వరకు ఆలస్యంగా బయలు దేరాయి.

Cyclone Biparjoy Efect: బిపర్‌జోయ్ విపత్తుతో ఇద్దరి మృతి, 22 మందికి గాయాలు, అంధకారంలో 940 గ్రామాలు

తుపాన్ వల్ల విమాన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విమానాశ్రయ అదికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలను వాటర్ ఫ్రూఫ్ బ్యాగుల్లో భద్రపర్చుకోవాలని విమాన ప్రయాణికులకు విమానాశ్రయ వర్గాలు సలహా ఇచ్చాయి.