PM Modi: కాంగ్రెస్ చేతకానితనమే మోదీ బలం.. – మమతా బెనర్జీ

కాంగ్రెస్ చేతగానితనమే ప్రధాని మోదీకి బలంగా మారిందంటున్నారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం, సీరియస్‌నెస్ లేకుండా

PM Modi: కాంగ్రెస్ చేతకానితనమే మోదీ బలం.. – మమతా బెనర్జీ

Mamata Benerjee

PM Modi: కాంగ్రెస్ చేతగానితనమే ప్రధాని మోదీకి బలంగా మారిందంటున్నారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం, సీరియస్‌నెస్ లేకుండా ప్రవర్తించడం వంటి అంశాలే కారణంగా మారుతున్నాయని విమర్శించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మూడు రోజుల గోవా పర్యటనకు వెళ్లిన మమతా బెనర్జీ.. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటారా అని అడిగిన ప్రశ్నపై స్పందించారు.

‘ఇప్పుడే నేనన్నీ చెప్పలేను. ఎందుకంటే కాంగ్రెస్ రాజకీయాలకు సిద్ధంగా లేదు. కాంగ్రెస్ కారణంగానే మోడీ అంత పవర్ ఫుల్ అయిపోతున్నారు. ఎవరో ఒకరు నిర్ణయం తీసుకోకపోవడం వల్ల దేశమెందుకు బాధపడాలి. గతంలో కాంగ్రెస్ కు ఒక అవకాశం ఉంది. బీజేపీతో పోరాడేకంటే నా సొంత రాష్ట్రంలో నాతో పోటీ చేయకుండా ఉండాల్సింది కదా. అని మమతా అన్నారు.

ప్రాంతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు బలోపేతం కావాలని పిలుపునిచ్చారు.

………………………………………: త్వరలోనే కొండపైకి ఎలక్ట్రిక్ బస్సులు

‘ప్రాంతీయ పార్టీలు శక్తిమంతం కావాలని అనుకుంటున్నా. ఫెడరల్ ప్రభుత్వాన్ని కావాలని కోరుకుంటున్నా. రాష్ట్రాలు బలోపేతమైతే.. కేంద్ర స్థాయిలోనూ బలంగా ఉంటాం. ఇప్పటివరకూ జరిగింది ఓకే. ఢిల్లీ దాదాగిరి ఇక కుదరనివ్వం’ అని టీఎంసీ అధినేత్రి మమతా అన్నారు.

ఓట్లను చీల్చాలని అనుకోవడం లేదు. అందుకే ప్రాంతీయ పార్టీలు కలిసి పనిచేయాలనుకుంటున్నాం. వారేం ఆలోచిస్తారో తేల్చుకోవాలి. బీజేపీని సంయుక్తంగా ఎదుర్కోవాలి’ అని బెనర్జీ అన్నారు.