TPT : త్వరలోనే కొండపైకి ఎలక్ట్రిక్ బస్సులు..ప్రారంభించనున్న సీఎం జగన్!

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి. సీఎం జగన్ చేతులు మీదుగా వీటిని ప్రారంభించాలని భావిస్తోంది.

TPT : త్వరలోనే కొండపైకి ఎలక్ట్రిక్ బస్సులు..ప్రారంభించనున్న సీఎం జగన్!

Tpt Jagan

TPT RTC e-buses : పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని రోడ్లపైకి తీసుకొచ్చేందుకు వేగంగా చర్యలు తీసుకొంటోంది. సీఎం జగన్ చేతులు మీదుగా వీటిని ప్రారంభించాలని భావిస్తోంది. సాధ్యమైనంత త్వరగా..ఇవి ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా తిరుమలలో కాలుష్యం లేకుండా చేయాలని ఏపీ ఆర్టీసీ సంకల్పించింది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తే..బాగుంటుందని ఏపీ ఆర్టీసీ భావించింది.

Read More : Telangana : మూడు రోజుల వరకు వర్షాలు, జాగ్రత్త

తిరుమల – తిరుపతి అర్బన్ మధ్య 100 ఈ బస్సులు, తిరుపతి – తిరుమల మార్గంలో మరో 50 బస్సులు నడిపేందుకు ఏపీ ఆర్టీసీ సిద్ధమైంది. కడప, చిత్తూరు, రేణిగుంట, నెల్లూరు, మదనపల్లి ప్రాంతాల నుంచి మరో 50 ఈ బస్సులు తిరుమలకు తిరిగేలా ప్రణాళికలు రచిస్తున్నారు. కాలుష్యం అరికట్టడంతో పాటు..భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లవుతుందని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ప్రైవేటు ట్రాన్స్ పోర్టల నుంచి బస్సులను అద్దెకు తీసుకుని…ఉపయోగించనున్నారు.

Read More : Huzurabad Bypoll : ఓటేసేందుకు క్యూ కట్టిన ఓటర్లు, 3 గంటల వరకు 61.66 శాతం పోలింగ్

అయితే..ఇలాంటి ప్లాన్ అమలు చేయాలని ఎప్పటి నుంచో ఉన్నా..వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ బస్సులు త్వరలోనే రోడ్డెక్కనుండడంతో ప్రయాణీకులతో పాటు అటు భక్తులు హర్షం వ్యక్త చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితమే ప్రయోగాత్మకంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులను నడిపి చూసింది. తిరుపతి నుంచి తిరుమలకు, తిరుమల నుంచి తిరుపతికి వీటిని నడిపింది. 32 మంది కూర్చొనే విధంగా ఈ బస్సును రూపొందించారు. ఇక ఈ బస్సును నడిపేందుకు అధికారులు అనుభవజ్ఞులైన ఆర్టీసీ డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు.