Modi :కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఇండియాకి ‘గౌరవ సభ్యదేశం’ హోదా.. ఇక్కడికొచ్చి సినిమాలు తీయండి.. విదేశీ నిర్మాతలకు మోదీ ఆహ్వానం..

ప్రఖ్యాత కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భారత దేశానికి ‘గౌరవ సభ్య దేశం’ హోదా దక్కడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేస్తూ తన సందేశాన్ని ఓ లేఖ ద్వారా..............

Modi :కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఇండియాకి ‘గౌరవ సభ్యదేశం’ హోదా.. ఇక్కడికొచ్చి సినిమాలు తీయండి.. విదేశీ నిర్మాతలకు మోదీ ఆహ్వానం..

Cannes Film Festival

Cannes Filim Festival :  ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరుగుతున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మన సినిమాలని కొన్ని ప్రదర్శించనున్నారు. మన దేశానికి చెందిన పలువురు నటులు కూడా ఈ ఫెస్టివల్ లో పాల్గొననున్నారు. అంతే కాక కాన్స్ చిత్రోత్సవాల్లో ఇండియాకి ‘గౌరవ సభ్య దేశం’ హోదాని ఇచ్చారు. దీంతో కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ కూడా ఈ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ప్రఖ్యాత కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భారత దేశానికి ఈ హోదా దక్కడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేస్తూ తన సందేశాన్ని ఓ లేఖ ద్వారా తెలిపారు.

ఈ లేఖలో భారతీయ సినిమా గొప్పతనం, ఇక్కడ సినిమాల చిత్రీకరణకు ఎంత అనుకూలంగా ఉంటుందో తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలను భారతదేశం నిర్మిస్తుందని, ఘనమైన సాంస్కృతిక వారసత్వ సంపద ఈ దేశ బలం అని, బయటి దేశాల నిర్మాతలకు కూడా ఇక్కడి చిత్ర నిర్మాణ రంగంలో సులభతర వాణిజ్య విధానాన్ని అమలు పరుస్తున్నామని, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, ప్రకృతి అందాలు ఉన్న భారతదేశం ప్రపంచ దర్శక నిర్మాతలకు నచ్చుతుందని తెలుపుతూ భారతదేశానికి వచ్చి సినిమాలు తీయండి అంటూ ఆహ్వానం పంపారు.

Sarika : థియేటర్ ఆర్టిస్ట్‌గా చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నా.. ఆర్ధిక సమస్యలలో కమల్ హాసన్ మాజీ భార్య..

ఇక సత్యజిత్ రే శత జయంతి ఉత్సవాల సందర్భంగా కాన్స్ క్లాసిక్‌ చిత్ర ప్రదర్శనలో సత్యజిత్‌ రే సినిమాలను ప్రదర్శించడం పట్ల మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దర్శక, నిర్మాతలు భారతదేశంలో సినిమాలు నిర్మించే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ లేఖ ద్వారా మోదీ కోరారు. దీంతో ఈ లేఖ ట్విట్టర్లో పలువురు షేర్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఫెస్టివల్ లో పాల్గొన్న ఫొటోలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.