పోలీసులను ఎదరించిన యువతి.. కొట్టిన ఎస్ఐ.. వైరల్ వీడియో!

పోలీసులను ఎదరించిన యువతి.. కొట్టిన ఎస్ఐ.. వైరల్ వీడియో!

కర్ణాటకలోని మాండ్యా నగరంలో ఓ యువతిని మహిళా ఎస్ఐ కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌‍గా మారింది. ఆ వీడియోలో స్కూటీ నడుపుతున్న అమ్మాయి పోలీసులతో వాగ్వాదానికి దిగగా.. అక్కడ ఉన్న మహిళా ఎస్ఐ సహనం కోల్పోయారు. స్కూటర్‌‌ను విడిచిపెట్టకుండా ఉన్న ఆమె చెంప చెళ్లుమనిపించింది ఎస్ఐ.

మండ్య నగరంలోని నోరడి రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకోగా.. మహిళా ఎస్ఐ కవితాగౌడ పాటిల్‌ వాహనాలను తనిఖీ చేస్తుండగా.. స్కూటీ రాంగ్ పార్కింగ్ చేసి ఉంది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన పోలీసులు స్కూటీని లాక్ చేసి పక్కన పెట్టారు. నా వద్ద డబ్బులు లేవు, డబ్బులు గూగుల్‌ పేలో పంపిస్తాను, మీ నంబర్‌ ఇవ్వండి అని యువతి పోలీసులను అడగగా.. ఒప్పుకోని పోలీసులు మొదట బండి దిగు , నీ పేరు, మీ నాన్న పేరు చెప్పు, మీ నాన్నను పోలీస్‌స్టేషన్‌కు పంపీ, అక్కడ బండిస్తాము అని చెప్పడంతో యువతి కోపంతో రగిలిపోయింది.

నా బండి ముట్టుకోవద్దు అని గట్టిగా అరుస్తుండగా.. ఎస్ఐ కవిత వచ్చి పోలీసులనే బెదిరిస్తావా? అంటూ చెంపదెబ్బ కొట్టింది. యువతి మరింత రెచ్చిపోయి నీవు ఎవరు నన్ను కొట్టడానికి, నీకు ఏమి అధికారం ఉంది. ఎనే మాడ్తియా రాస్కెల్‌ అంటూ గొడవ చేసింది. పోలీసులు స్కూటీని పోలీస్‌స్టేషన్‌కు తీసుకుపోగా.. యువతిని ఎస్ఐ కొట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. చట్టప్రకారం.. ఎస్ఐకి యువతిని కొట్టే హక్కు లేదని వెంటనే ఆమెను సస్పెండ్ చెయ్యాలని అంటున్నారు నెటిజన్లు.