Jallikattu : నో మాస్క్..భౌతిక దూరం లేదు..జల్లికట్టు పోటీలు ప్రారంభం

జల్లికట్టు పోటీల్లో పాల్గొనేందుకు కేవలం 300 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించింది. పోటీలను తిలకించేందుకు 150 మంది ప్రేక్షకులు లేదా 50 శాతం సిట్టింగ్‌ సామర్థ్యానికి....

Jallikattu : నో మాస్క్..భౌతిక దూరం లేదు..జల్లికట్టు పోటీలు ప్రారంభం

Jallikattu

Jallikattu Tamil Nadu : మాస్కులు లేవు.. భౌతిక దూరం లేదు..! వందల్లోనే ప్రేక్షకులను అనుమతించాలంటూ రూల్‌ పెట్టారు.. అయితే ప్రేక్షకులు మాత్రం వేలాల్లో వచ్చారు. తమిళ సర్కార్‌ విధించిన నిబంధనలు అణువంతైనా అమలు కావడం లేదు. కరోనా నిబంధనల ఉల్లింఘిస్తూ తమిళనాడులో జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. కరోనా థర్డ్‌వేవ్‌ కేసుల విధ్వంసం సృష్టిస్తుండడంతో అసలు ఈ ఏడాది జల్లికట్టు జరుగుతుందా లేదా అన్నదాని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఊహగానాలకు చెక్ పెడుతూ జల్లికట్టుకు తమిళనాడు సర్కార్ పచ్చ జెండా ఊపింది. ప్రతి ఏటా నిర్వహించే జల్లికట్టుకు ఈ ఏడాది కూడా అనుమతిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, కొవిడ్‌ మార్గదర్శకాలను తప్పకుండా అనుసరించాలన్నారు. కరోనా వ్యాప్తి వేగంగా ఉండడంతో జల్లికట్టు పోటీలో పాల్గొనే ఆటగాళ్లు, ప్రేక్షకులు మాత్రం తప్పకుండా 2 డోస్‌ల కరోనా వ్యాక్సిన్‌ తీసుకుని ఉండాలని ప్రకటించారు.

Read More : Kodi Pandalu : బరికి సై అంటున్న పందెం కోళ్లు…వద్దంటున్న పోలీసులు

జల్లికట్టు పోటీల్లో పాల్గొనేందుకు కేవలం 300 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించింది. పోటీలను తిలకించేందుకు 150 మంది ప్రేక్షకులు లేదా 50 శాతం సిట్టింగ్‌ సామర్థ్యానికి మించకూడాదని వెల్లడించింది తమిళనాడు సర్కార్. పోటీల ప్రారంభానికి 48 గంటల ముందు కోవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ వెంట తీసుకుని రావాలని సూచించింది. అయితే ఇదంతా జరగడం లేదని సమాచారం. కరోనా కేసుల విలయం తమిళనాడులో కొనసాగుతోంది. పండుగ వేళ జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ సూచించి 24గంటలు కూడా కాలేదు.. ఇంతలోనే జల్లికట్టుతో నిబంధనలకు బ్రేక్‌ పడినట్లయింది.

Read More : Bhogi : తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు

కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ సమరానికి కుర్రాళ్లు కాలుదువ్వారు. జల్లికట్టుకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే మధురైలో ఎద్దుల కొమ్ములు వంచేందుకు ప్రయత్నిస్తున్నారు యువకులు. ఎంతకూ లొంగని ఎద్దు దొరికినవాళ్లను దొరికినట్టుగా కుమ్మేస్తోంది. ఎవరడ్డు వచ్చినా సరే ఆ రింగులో తిరుగుతూ కొమ్ములతో పొడుస్తోంది. పదునైన కొమ్ములతో విరుచుకుపడుతోంది. ఆట మొదలైన కాసేపటికే కొంతమంది యువకులకు గాయలయ్యాయి.