BRS Suspends Ponguleti : నన్ను సస్పెండ్ చేయటం దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లుగా ఉంది : పొంగులేటి

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. తనను సస్పెండ్ చేయటంపై పొంగులేటీ స్పందించారు. బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు.

BRS Suspends Ponguleti : నన్ను సస్పెండ్ చేయటం దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లుగా ఉంది : పొంగులేటి

BRS Suspends Ponguleti

BRS Suspends Ponguleti: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)పై బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధిష్టానం సస్పెన్షన్ (Suspension) వేటు వేసింది. తనను సస్పెండ్ చేయటంపై పొంగులేటీ స్పందించారు. బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. నన్ను బీఆర్ఎస్ సస్పెండ్ చేయటం దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లుగా ఉంది అంటూ ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ తెస్తామని ప్రజలను నమ్మించారని కానీ అధికారంలోకి వచ్చాకు మీరు రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లుగా మీరు రాష్ట్రానికి ఏం చేశారు?అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయటం ఎంతో హాస్యాస్పదంగా ఉందని దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లుగా ఉందంటూ ఎద్దేవా చేశారు. నిధులు, నీళ్లు, నియామకాలు పేరుతో తెలంగాణను సాధించుకున్నామని కానీ వీటిలో మీరు దేనిని నెరవేర్చారు?ప్రజలకు ఏం చేశారు?అంటూ ప్రశ్నించారు.

Jupally Krishna Rao : పంజరంలోంచి బయటపడినట్లుగా ఉంది.. సస్పెన్షన్‌పై జూపల్లి సంచలన వ్యాఖ్యలు

2014 ఎన్నికల తరువాత నేను ఎంపీగా ఎన్నికై ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నానన్నారు. నేను వంద రోజులుగా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని..కానీ ఎటువంటి సమాధానం చెప్పే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్నారు. ఇన్నాళ్టికైనా తనను సస్పెండ్ చేసే ధైర్యం బీఆర్ఎస్ కు వచ్చిందని దానికి బీఆర్ఎస్ ను ప్రశంసిస్తున్నానన్నారు. తనకు పార్టీ సభ్యత్వమ లేదన్నారు. మరి నేను సభ్యుడినే కాననప్పుడు తనను ఎలా సస్పెండ్ చేశారు?అంటూ ప్రశ్నించారు.

తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో పలు సందర్భాల్లో ఎన్నో ఇబ్బందులు పెట్టినా, అవమానపర్చినా దిగమింగుకుని ఉన్నానన్నారు. పార్లమెంటు ఎన్నికలల్లో తనకు ఎంపీ సీటు ఇవ్వకపోయినా.. కేటీఆర్ గురించే బీఆర్ఎస్ లో ఉన్నానని అన్నారు. తప్పు మీ పక్కన పెట్టుకుని.. ఫలితాలు వచ్చిన తర్వాత ఎదుటివారిపై నిందమోపటం బీఆర్ఎస్ అధినాయకత్వానికి అలవాటు అంటూ ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉందనే విషయం అందరికి తెలుసు..అటువంటి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గురించి కృషి చేశానన్నారు. రాజకీయంగా నాకు భవిష్యత్తు లేకుండా చేద్దామనే కుట్రలను గ్రహించానని అయినా పార్టీ కోసం పాటుపడ్డానన్నారు. నా ఒంట్లో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకూ ప్రజల్లో ఉంటా ప్రజలతోనే ఉంటానని అన్నారు.

BRS Suspends Ponguleti: వేటు పడింది..! బీఆర్ఎస్ పార్టీ నుంచి జూపల్లి, పొంగులేటి సస్పెన్షన్

కాగా..మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)తో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao)పై కూడా బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధిష్టానం సస్పెన్షన్ (Suspension) వేటు వేసింది. పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇద్దరిపై వేటు వేసింది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. కొద్దికాలంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు వీరిద్దరు దూరంగా ఉంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత నెలరోజులుగా బీఆర్ఎస్ అధిష్టానం, సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఖమ్మం, భద్రాచలం జిల్లాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు పొంగులేటి స్పష్టం చేశారు. కానీ పొంగులేటిపై ఇప్పటి వరకు వేటు వేయకుండా బీఆర్ఎస్ అధిష్టానం వేచి చూసింది. ఈక్రమంలో జూపల్లి కూడా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఇద్దరిపైనా ఒకేసారి వేటు వేసింది బీఆర్ఎస్. పార్టీ నుంచి సస్పెండ్ .జూపల్లి  ఏ పార్టీలో చేరతారు? ఏ పార్టీలో చేరుతారనే విషయం ఆసక్తికరంగా మారిింది.