Pooja Hegde : పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమాలో పూజా హెగ్డే

హరీష్ శంకర్ పూజా హెగ్డే గురించి మాట్లాడుతూ.. పూజా హెగ్డే ఇప్పుడు చాలా బిజీ అయింది అని, ఆమె డేట్ల కోసం కాదు ఆమెతో ఫోన్‌లో మాట్లాడేందుకు కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది అని

Pooja Hegde : పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమాలో పూజా హెగ్డే

Pooja

Pooja Hegde :  అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే కాంబలో త్వరలో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్’ సినిమా రాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిన్న సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి నాగ చైతన్య చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఈ కార్యక్రమంలో కొంతమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ క్రమంలో స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన హరీష్ శంకర్ ఈ సినిమా గురించి మాట్లాడటంతో పాటు తన నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సినిమా గురించి కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు.

హరీష్ శంకర్ పూజా హెగ్డే గురించి మాట్లాడుతూ.. పూజా హెగ్డే ఇప్పుడు చాలా బిజీ అయింది అని, ఆమె డేట్ల కోసం కాదు ఆమెతో ఫోన్‌లో మాట్లాడేందుకు కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది అని అన్నారు. మన అందరికి లాక్డౌన్ వచ్చి ఖాళీగా ఉన్నాం. కానీ పూజా హెగ్డే మాత్రం ఒక్క రోజు కూడా ఖాళీగా లేదు. ఎవరైనా దర్శకులు హీరోయిన్ల డేట్ల కోసం ఎదరుచూస్తుంటారు. కానీ ఇప్పుడు పూజా హెగ్డే ఫోన్ కాల్ కోసం కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమెతో మాట్లాడాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందేమో అని వ్యాఖ్యానించారు. ఈ ఈవెంట్‌కు కూడా పూజా హెగ్డే వస్తుందా? లేదా? అని అనుమానం వచ్చింది. ఈ రెండు మూడు గంటలు కూడా ఏదైనా సినిమాకు ఇచ్చిందా? అని అనుకున్నాను అంటూ సరదాగా మాట్లాడారు.

B.Gopal : దర్శకుడు బి.గోపాల్ కు సత్యజిత్ రే పురస్కారం..

అంతే కాక పూజా ఇప్పుడు స్టార్ హీరోలందరితో నటిస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో కూడా నటింస్తుంది అని మాటల్లో చెప్పేసాడు. ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డేను ఫిక్స్ చేసినట్టు సమాచారం ఇచ్చేసారు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత హరీష్ శంకర్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ” భవదీయుడు భగత్ సింగ్” అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఇలా ఈవెంట్ స్పీచ్ లో పూజా హెగ్డే పవన్ కళ్యాణ్ తో నటిస్తుందని ఇండైరెక్ట్ గా చెప్పేసాడు హరీష్.