Prabhas : ఆ ఫైట్‌లో నిజంగానే వీపు మీద కర్రతో కొట్టారు

తాజా ఇంటర్వ్యూలో అప్పటి సంగతుల్ని గుర్తు చేస్తూ నా వీపుని పగలకొట్టారు అని చెప్పాడు ప్రభాస్. 'చత్రపతి' సినిమాలో సముద్రం ఒడ్డున ప్రభాస్‌, విలన్‌ కాట్రాజ్‌ల మధ్య ఫైట్‌ సీన్‌..........

Prabhas : ఆ ఫైట్‌లో నిజంగానే వీపు మీద కర్రతో కొట్టారు

Prabhas

Updated On : March 10, 2022 / 3:29 PM IST

 

Prabhas :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ ప్రస్తుతం ‘రాధేశ్యామ్‌’ ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉన్నాడు. ఈ సినిమా మార్చ్ 11న విడుదల కానుంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు ప్రభాస్. ఈ ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికర విషయాలని తెలియచేస్తున్నారు డార్లింగ్. తాజాగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాధేశ్యామ్ ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ తో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాడు ప్రభాస్. ఈ ఇంటర్వ్యూలో రవీందర్ తో గతంలో పని చేసిన వాటి గురించి తెలిపాడు.

‘రాధేశ్యామ్’కి పనిచేసిన ఆర్ట్‌ డైరెక్టర్‌ రవిందర్‌ గతంలో ‘ఛత్రపతి’ సినిమాకి కూడా పని చేశాడు. ప్రభాస్ కెరీర్ లో ‘ఛత్రపతి’ సినిమా అప్పటి వరకు వచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతే కాక ప్రభాస్ ని మాస్ హీరోగా నిల్చోపెట్టింది. ఈ సినిమాలో మాస్, యాక్షన్ సీన్స్ చాలా ఉంటాయి. తాజా ఇంటర్వ్యూలో అప్పటి సంగతుల్ని గుర్తు చేస్తూ నా వీపుని పగలకొట్టారు అని చెప్పాడు ప్రభాస్. ‘చత్రపతి’ సినిమాలో సముద్రం ఒడ్డున ప్రభాస్‌, విలన్‌ కాట్రాజ్‌ల మధ్య ఫైట్‌ సీన్‌ జరుగుతుంది. ఈ సన్నివేశంలో ప్రభాస్‌ను విలన్‌ కర్రతో కోడతాడు. దీని కోసం విలన్‌ కాట్రాజ్‌ క్యారెక్టర్ చేసిన సుప్రీత్ సముద్రం ఉప్పుతో చేసిన నిజమైన కర్రను ఇచ్చారట. అయితే ఈ విషయం ప్రభాస్‌కు, విలన్‌ సుప్రిత్‌కు తెలియదు. దీంతో విలన్‌ సుప్రీత్‌ డూప్‌ కర్ర అనుకుని ప్రభాస్ వీపుపై గట్టిగా కొట్టాడని తెలిపాడు ప్రభాస్.

RGV : నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి..

ఆ విషయాన్ని ఇప్పుడు ఇంటర్వ్యూలలో తెలుపుతూ అలా నిజమైన కర్రతో కొట్టినప్పుడు నా వీపు పగిలిపోయిందంటూ ఫన్నీగా చెప్పాడు ప్రభాస్‌. అయితే ఇదే విషయాన్ని ఆర్ట్‌ డైరెక్టర్‌ రవిందర్‌ను అడిగితే పర్ఫెక్షన్ కోసం ఒరిజినల్ కర్రని ఇచ్చాను అని చెప్పాడంట. ప్రభాస్ సినిమా కోసం ఎంత కష్టపడతాడో అందరికి తెలిసిందే. దీంతో సినిమా కోసం నిజంగా దెబ్బలు తిన్నాడని కూడా తెలుస్తుంది.