MAA Elections 2021 : బండ్ల గణేష్‌కు ప్రకాష్ రాజ్, జీవిత సెటైర్..

‘మా’ సభ్యులకు ప్రకాష్ రాజ్ విందు ఏర్పాటు చెయ్యడం గురించి బండ్ల గణేష్ చేసిన కామెంట్స్‌కి జీవిత రాజశేఖర్, ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు..

MAA Elections 2021 : బండ్ల గణేష్‌కు ప్రకాష్ రాజ్, జీవిత సెటైర్..

Jeevitha Rajasekhar

Updated On : September 12, 2021 / 4:16 PM IST

MAA Elections 2021: ‘మా’ ఎన్నికల్లో రాజకీయం వేడెక్కుతుంది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నవారు ‘మా’ సభ్యులతో మీటింగ్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఫిలింనగర్‌లోని జే‌ఆర్‌సి కన్వెన్షన్‌లో ‘మా’ సభ్యులను లంచ్‌కు ఆహ్వానించారు ప్రకాష్ రాజ్. ‘మా’ సభ్యులకు ప్రకాష్‌ రాజ్‌ విందు ఏర్పాటు చెయ్యడంపై బండ్ల గణేష్‌ కౌంటర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా బండ్ల గణేష్ చేసిన కామెంట్స్‌పై ప్రకాష్ రాజ్ స్పందించారు. ఆయన 10 TV తో మాట్లాడుతూ..

MAA Elections 2021 : ‘మా’ సభ్యులకు ప్రకాష్ రాజ్ విందు.. కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్..

‘‘బండ్ల యూటర్న్ తీసుకున్నారు.. ఆయనకు ట్రాఫిక్ కష్టం వచ్చినట్టుంది.. ఏం చేస్తాం.. అందరినీ మెప్పించలేం కదా.. అందుకే బండ్ల హర్ట్ అయ్యారనుకుంటా.. ఆయన ఇష్టం.. ఆయనకు సమాజం మీద ప్రేమ ఎక్కువగా ఉన్నట్లుంది.. బండ్ల ప్రవర్తన అందరికి తెలుసిందే.. గతంలో బండ్ల అటెండ్ అయిన మీటింగ్‌ల గురించి మాట్లాడితే బాగుండేది.. ఎన్నికలన్నాక ప్రచారం చేసుకుంటాం.. అందులో తప్పేముంది..? అసోసియేషన్ ఎలక్షన్స్ అంటే డిస్కస్ చేయడం, అందరితో మాట్లాడడం, క్యాంపెయిన్ చెయ్యడం జరుగుతుంది.

Bandla Ganesh : ఎప్పుడు ఏం మాట్లాడాలో నేర్చుకోండి.. వివరణ ఇచ్చిన వీకే నరేష్

అలాగే ఈ రోజు ఇక్కడ కొంతమంది ఆర్టిస్టులను లంచ్‌కి పిలిచాము.. చిన్న ఆర్టిస్టులు ఈ రోజు మాట్లాడారు. దాదాపు మూడు నాలుగు గంటలు డిస్కస్ చేసాము.. ఇప్పటివరకు జరిగినవి, జరగాల్సినవి అనేవి ఆర్టిస్టులందరితో మాట్లాడం.. బండ్ల గణేష్ మాటలకు నేను నిజంగా షాక్ అయ్యాను.. గుజరాత్‌లో మరి కొన్ని చోట్ల ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి అందరూ అక్కడకి వెళ్తున్నారు.. మరి దాని గురించి బండ్ల ఏమంటారు.. ‘మా’ సభ్యుల సమస్యలు తెలుసుకున్నాను.. పరిష్కారాలపై కూడా చర్చించుకున్నాం.. ఎలక్షన్స్ నోటిఫికేషన్ 19న వస్తుంది.. నోటిఫికేషన్ రాగానే మ్యానిఫెస్టో ప్రకటిస్తా’’ అన్నారు.

Laal Singh Chaddha : నాగ చైతన్య క్యారెక్టర్ నేను చెయ్యాల్సింది..

ఇక బండ్ల గణేష్ వ్యాఖ్యలపై నటి జీవిత రాజశేఖర్ కూడా స్పందించారు.. ‘‘ఇండియా లెవల్‌లో ‘మా’ కి ఒక గౌరవం ఉంది. ‘మా’ అంటే అందరూ తలెత్తుకొని ఉండేలా ఉండాలి..
పేద కళాకారులకు పర్మినెంట్‌గా ఏం చెయ్యాలో అవి చేస్తాం.. మెంబెర్స్‌కి ఏమి చెయ్యాలో, వారికి అవసరం ఉన్నవి ఏంటో అవన్నీ డిస్కస్ చేసాం..

Prakash Raj : వీరాభిమాని పాదయాత్ర.. విలక్షణ నటుడు ట్వీట్ వైరల్..

ప్రకాష్ రాజ్ మా ఇంటికి రెండు మూడు సార్లు వచ్చి ఆయన విజన్ క్లియర్‌గా చెప్పారు.. నాకన్నా ప్రకాష్ రాజ్ నెట్ వర్క్ చాలా పెద్దది.. ఆయన అందరికీ తెలిసిన ఆర్టిస్ట్.. బండ్ల గణేష్ ఇరవై నాలుగు గంటలు నా గురించి మాట్లాడడం హాస్యాస్పదం.. కరోనా రూల్స్ పాటిస్తూ పెళ్ళిళ్ళు, సమావేశాలు జరుపుకుంటున్నాం.. ఎన్ని రోజులు అని ఇంట్లో కూర్చుని ఉంటాం.. కరోనా రూల్స్ పాటిస్తూ ఈ సమావేశం జరిగింది’’ అన్నారు.