NTR31: బాబోయ్ ప్రశాంత్ నీల్.. తారక్ ఊరమాస్ లుక్ వచ్చేసింది!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో సాలిడ్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో చెలరేగిపోయి యాక్ట్ చేసిన తారక్, ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు.

NTR31: బాబోయ్ ప్రశాంత్ నీల్.. తారక్ ఊరమాస్ లుక్ వచ్చేసింది!

Ntr31

NTR31: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో సాలిడ్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో చెలరేగిపోయి యాక్ట్ చేసిన తారక్, ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న తారక్.. కొరటాలతో తెరకెక్కే 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా పక్కా మాస్ మోషన్ టీజర్ వదిలారు.

NTR31: తారక్‌తో కమల్.. ప్రశాంత్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

మోషన్ టీజర్ తో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ సినిమా పట్టాలెక్కకముందే, తారక్ కెరీర్‌లో 31వ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా వదిలారు. తారక్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ 31 సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఒకరకంగా ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ సినిమాపై ప్రచారమే అనుకోగా.. ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్ లో రానున్న సినిమాపై అధికారిక ప్రకటన వచ్చినట్లైంది.

NTR31: తారక్‌తో ప్రశాంత్ సినిమా.. జోడీగా బాలీవుడ్ క్వీన్?

ఎన్టీఆర్ ఆర్ట్స్ , మైత్రి మూవీ మేకర్స్ సంయుక్త నిర్మిస్తున్న ఎన్టీఆర్ 31 సినిమా ప్రశాంత్ నిల్ తో అంటు ఎన్టీఆర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ లో ఎన్టీఆర్ ఉగ్రరూపంలో కనిపిస్తున్న ఈ పోస్టర్ మాస్ కే మాస్ ఊరమాస్ అన్నట్లుగా దుమ్మురేపుతోంది. జస్ట్ పోస్టర్ కే ఇలా ఉంటే ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో అంటూ తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.