అన్‌ఫినిష్డ్.. న్యూయార్క్‌లోని బిల్ బోర్డ్‌లో ప్రియాంక చోప్రా బుక్

అన్‌ఫినిష్డ్.. న్యూయార్క్‌లోని బిల్ బోర్డ్‌లో ప్రియాంక చోప్రా బుక్

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. త‌న జ్ఞాప‌కాల‌తో రూపొందించిన బుక్ ‘అన్‌ఫినిష్డ్’. ఈ బుక్ స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండగా.. రిలీజ్ చేసిన తర్వాత తక్కువ సమయంలోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంటోంది. మార్కెట్‌లో విడుదలైన వారంలోపే ఈ పుస్తకం న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్ల‌ర్స్ లిస్ట్‌లో చేరిపోగా.. విపరీతంగా సేల్ అవుతున్నాయి.

సినీ న‌టి, నిర్మాత‌, హ‌క్కుల కార్య‌క‌ర్త‌, యునిసెఫ్ ప్ర‌చార‌క‌ర్త అయిన ప్రియాంక చోప్రా.. త‌న సినిమా ప్రయాణం, జీవితంలో ముఖ్యమైన విషయాలకు సంబంధించి అన్‌ఫినిషడ్ బుక్‌లో రాశారు. ఈ బుక్ ఫిబ్రవరి 9న విడుదల కాగా.. పుస్తకానికి వచ్చిన ఆదరణ చాలా ఎక్కువే.. బెస్ట్ సెల్ల‌ర్‌గా నిలిచిన అన్‌ఫినిష్డ్ బుక్‌ను లేటెస్ట్‌గా న్యూయార్క్ సిటీలోని పెన్ స్టేషన్ బయట ఆరు అంతస్థుల్లో @amazonbooks బిల్‌బోర్డ్‌పై వేశారు.

మహిళల గొంతు అనే క్యాప్షన్‌తో ఉమెన్స్ హిస్టరీ మాంట్ వేడుకలో చేర్చడంపై ఆనందం వ్యక్తం చేస్తూ ఓ ఫోటోను ప్రియాంక చోప్రా పంచుకుంది. ఈ బుక్ రిలీజ్ అయ్యి సరిగ్గా నెల పూర్తయ్యింది అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. ప్రియాంక చోప్రా ఇటీవల వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టింది. న్యూయార్క్‌లో ‘సోనా’ అనే రెస్టారెంట్‌ను ప్రారంభించారు.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra)