Sankranthi Theaters Issue : సినిమా అనేది బిజినెస్ అంతే.. సంక్రాంతి థియేటర్స్ ఇష్యూపై స్పందించిన నిర్మాత సురేష్ బాబు..

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. ''తెలుగు సినిమాకి హద్దులు చెరిగిపోయాయి. మన సినిమాని ఎక్కడా కూడా చులకనగా చూడట్లేదు. తమిళ్ లో RRR రిలీజయినప్పుడు అక్కడి వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు. కానీ.........

Sankranthi Theaters Issue : సినిమా అనేది బిజినెస్ అంతే.. సంక్రాంతి థియేటర్స్ ఇష్యూపై స్పందించిన నిర్మాత సురేష్ బాబు..

Producer Suresh Babu comments on Sankranthi Theaters Issue

Sankranthi Theaters Issue :  సంక్రాంతి సినిమాలకి థియేటర్స్ సంబంధించి వివాదం జరుగుతూనే ఉంది. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఉండగా తమిళ్ డబ్బింగ్ సినిమా వారసుడు రిలీజ్ చేస్తానని దిల్ రాజు ముందుకి రావడంతో వివాదం మొదలైంది. ఇక సంక్రాంతికి ముందు తెలుగు సినిమాలకే థియేటర్స్ ఇవ్వాలని, తర్వాతే తమిళ్ సినిమాలకి ఇవ్వాలని తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చేసిన నోటీసుతో వివాదం మరింత చెలరేగింది.

ఈ విషయంలో టాలీవుడ్ లోని పెద్దలు ఒకొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొంతమంది డబ్బింగ్ సినిమాలు కూడా ఆడాలి అంటుంటే కొంతమంది కేవలం తెలుగు సినిమాలే ఆడాలి అని అంటున్నారు. తాజాగా దీనిపై నిర్మాత సురేష్ బాబు స్పందించారు.

BiggBoss 6 Day 93 : మళ్ళీ పెంచిన ప్రైజ్‌మనీ.. దాంతో పాటు మరిన్ని.. విన్నర్‌కి బంపరాఫర్స్ ప్రకటించిన బిగ్‌బాస్..

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. ”తెలుగు సినిమాకి హద్దులు చెరిగిపోయాయి. మన సినిమాని ఎక్కడా కూడా చులకనగా చూడట్లేదు. తమిళ్ లో RRR రిలీజయినప్పుడు అక్కడి వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు. కానీ సినిమా ఆడటంతో ఎక్కువ థియేటర్స్ ఇచ్చారు. సినిమా అంటే బిజినెస్ అంతే. జనాలు ఎక్కువ వచ్చే సినిమాకి, బాగున్న సినిమాకి థియేటర్స్ ఎక్కువ ఇస్తారు. సినిమా బాగోకపోతే, జనాలు రాకపోతే థియేటర్ లోంచి తీసేస్తారు. అది ఏ భాష సినిమా అయినా ఇలాగే చేస్తారు. సంక్రాంతి సినిమాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మొదట ఎక్కువ థియేటర్స్ ఎవరికీ వెళ్లినా సినిమా బాగోకపోతే తీసేస్తారు, సినిమా బాగుంటే ఆడిస్తారు” అని అన్నారు.