ProjectK: అందరికీ ఇదే డ్రీమ్ ప్రాజెక్ట్.. ట్వీట్స్ తో అట్రాక్ట్ చేసిన స్టార్స్!

ఎట్టకేలకు స్పీడ్ అందుకుంది డార్లింగ్ డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రస్తుతానికి రాధేశ్యామ్ ప్రమోషన్స్ పక్కకు పెట్టి మరీ ప్రాజెక్ట్ కె షూటింగ్..

ProjectK: అందరికీ ఇదే డ్రీమ్ ప్రాజెక్ట్.. ట్వీట్స్ తో అట్రాక్ట్ చేసిన స్టార్స్!

Projectk

ProjectK: ఎట్టకేలకు స్పీడ్ అందుకుంది డార్లింగ్ డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రస్తుతానికి రాధేశ్యామ్ ప్రమోషన్స్ పక్కకు పెట్టి మరీ ప్రాజెక్ట్ కె షూటింగ్ తో దూసుకుపోతున్నారు ప్రభాస్. రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో అమితాబ్, ప్రభాస్ లపై ఫస్ట్ షాట్ షూట్ చేసారు నాగ్ అశ్విన్. ఆ ఫస్ట్ షాట్ తర్వాత అటు బిగ్ బి ఇటు గ్లోబల్ స్టార్.. ఇద్దరూ చేసిన ట్వీట్స్ ఫ్యాన్స్ లో క్రేజీనెస్ ను డబుల్ చేశాయి.

Arabic Kuthu: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అరబిక్ కుతు సాంగ్!

ప్రభాస్, అమితాబ్ లను కలిపి ఫస్ట్ షాట్ షూట్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్ కె షూటింగ్ లో ప్రభాస్, బిగ్ బి విడివిడిగానే పాల్గొన్నారు. ఈ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ షూట్ స్టార్ట్ అయింది అమితాబ్ సీన్స్ తోనే. ఆపై ప్రభాస్ – దీపికా పదుకోనె కలిసి కొన్ని సీన్స్ చేశారు. అయితే నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రస్తుతం బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ – గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఒకే ఫ్రేమ్ లో నటిస్తున్నారు.

Project K : ప్రభాస్‌తో పని చేయడం నాకు గౌరవం.. ప్రభాస్‌పై అమితాబ్ ట్వీట్..

ప్రాజెక్ట్ కె కొత్త షెడ్యూల్ ఫస్ట్ డే షూట్ అయిందో లేదో… తన కల నెరవేరిందంటూ అమితాబ్ దీవార్ మూవీ స్టిల్ తో ఓ పోస్ట్ చేశారు ప్రభాస్. ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ తో కలిసి ఫస్ట్ షాట్ కంప్లీట్ చేసానని ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను షేర్ చేశారు. అటు బిగ్ బి సైతం ఫస్ట్ డే.. ఫస్ట్ షాట్.. బాహుబలి ప్రభాస్ తో ఫస్ట్ ఫిల్మ్ చేయడం ఆనందంగా ఉందంటూ ట్వీట్ వదిలారు. ప్రభాస్ ఆరా, టాలెంట్, తను ప్రదర్శించే వినయాన్ని చూసి చాలా నేర్చుకోవాలని ఉందంటూ యంగ్ రెబల్ స్టార్ పై పొగడ్తల వర్షం కురిపించారు లెజండ్రీ యాక్టర్ అమితాబ్.

Project K : చేయి చేయి కలిపిన ప్రభాస్ – దీపికా పదుకొణె

నిజానికి ప్రాజెక్ట్ కే అన్నది డైరెక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వనీదత్ తో పాటూ ప్రభాస్, అమితాబ్, దీపికా.. ఇలా ప్రతి ఒక్కరీ డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే ఈ మూవీ ఒక్కో అడుగు ముందుకేస్తుంటే మురిసిపోతున్నారు వీళ్లంతా. దాదాపు 4వందల కోట్ల బడ్జెట్ తో టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కతోంది ప్రాజెక్ట్ కే. కథకు తగ్గట్టే ఎక్కడా రాజీపడకుండా భారీ సెట్స్ ను సెట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడలాంటి నెవర్ బిఫోర్ సెట్స్ లోనే ప్రభాస్ – అమితాబ్ కలిసి నటిస్తున్నారు.