Punjab Amritsar : స్వర్ణ దేవాలయంలో యువకుడు వీరంగం..కొట్టి చంపిన భక్తులు

అమృత్ సర్ లోని ప్రముఖ స్వర్ణ దేవాలయంలో కలకలం రేగింది. దేవాలయాన్ని అపవిత్రం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని కొందరు కొట్టి చంపేశారు.

Punjab Amritsar : స్వర్ణ దేవాలయంలో యువకుడు వీరంగం..కొట్టి చంపిన భక్తులు

Punjab Amritsar

Amritsar Golden Temple : అమృత్ సర్ లోని ప్రముఖ స్వర్ణ దేవాలయంలో కలకలం రేగింది. దేవాలయాన్ని అపవిత్రం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని కొందరు కొట్టి చంపేశారు. గర్భగుడిలోకి చొరబడడం, పవిత్రమైన గురుగ్రంథ్ సాహిబ్ చదువుతున్ని సిక్కు పూజారీ వద్దకు వెళ్లి భయబ్రాంతులకు గురి చేశాడు. ఆగ్రహానికి గురైన భక్తులు అతడిపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడనే మృతి చెందాడు. పవిత్ర ఆలయంలో భద్రతపై భక్తులు ప్రశ్నిస్తున్నారు. 2021, డిసెంబర్ 18వ తేదీ శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.

Read More : Unstoppable With NBK: రాజమౌళి.. ఆ బ్లాక్‌బస్టర్ కథను బాలయ్యకే చెప్పారట!

తలకు పసుపు వస్త్రం చుట్టుకుని ఓ వ్యక్తి స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించాడు. ఆలయంలోపున ఉన్న బంగారు గ్రిల్స్ పై నుంచి దూకి నిషిద్ధ గర్భగుడిలోకి వెళ్లిపోయాడు. అక్కడున్న కత్తిని పట్టుకుని వీరంగం సృష్టించాడు. గురుగ్రంథ్ పఠిస్తున్న పూజారి వైపుగా వెళ్లి…అతడిని భయబ్రాంతులకు గురి చేశాడు. హఠాత్ పరిణామంతో అక్కడున్న భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ (NGPC) టాస్క్ ఫోర్స్ సభ్యులు అతడిని పట్టుకున్నారు. కార్యాలయానికి తీసుకెళుతుండగా..భక్తులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు.

Read More : Samantha : ఐటెం సాంగ్‌కి సమంత ఒప్పుకోలేదు.. నేనే ఒప్పించాను

అతడిపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టడంతో మరణించారు. యువకుడి గురించి వివరాలు ఆరా తీస్తున్నామని, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడిగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీఎం చరణ్ జిత్ సింగ్ విచారం వ్యక్తం చేస్తూ…విచారణకు ఆదేశించారు.