Sonu Sood : సోనూ సూద్ సోదరి పరాజయం

ఆప్ ధాటికి కాంగ్రెస్ తో పాటు బీజేపీ పత్తా లేకుండా పోయాయి. పంజాబ్ రాష్ట్రంలో ఆప్ ఏకపక్షంగా ప్రభుత్వ ఏర్పాటు కు సిద్ధమైంది. తాము రాజకీయాలు చేయము.. ఢిల్లీ అభివృద్ధిని చూడండి..

Sonu Sood : సోనూ సూద్ సోదరి పరాజయం

Sonu Sood

Punjab Election 2022 : ఢిల్లీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆప్.. మరోరాష్ట్రంలో అడుగుపెట్టింది. పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఘనమైన విజయం దిశగా ముందుకెళుతోంది. ఆప్ దెబ్బకు బడాబడా నేతలు పరాజయం పాలవుతున్నారు. చిన్న అభ్యర్థుల చేతుల్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సైతం ఓటమి చెందుతున్నారు. మొత్తం 117 సీట్లున్న పంజాబ్ లో ఆప్ ఏకంగా 91 స్థానాల్లో అధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్ కేవలం 19 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. పరాజయం చెందిన వారిలో ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ ఓడిపోయారు. మోగా నియోజకవర్గం నుంచి ఈమె ఎన్నికల బరిలో ఉన్నారు. ఆప్ అభ్యర్థి డాక్టర్ అమన్ దీప్ కౌర్ అరోరా చేతిలో పరాజయం చెందారు. ఏకంగా 58 వేల 813 ఓట్ల తేడాతో అమన్ దీప్ గెలుపొందారు. మాళవికకు 38 వేల 125 ఓట్లు వచ్చినట్లు సమాచారం.

Read More : Punjab Election 2022 : సోనూ సూద్ కదలికలిపై నిఘా, కారు సీజ్

కరోనా కాలంలో సోనూ సూద్ చేసిన సేవలు అందరికీ గుర్తుండే ఉంటుంది. సోనూ సూద్ సోదరి సామాజిక సేవలో కూడా పాల్గొన్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికల తరుణంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తుందని, తాను మాత్రం రాజకీయాల్లోకి రావడం లేదని సోనూ వెల్లడించారు. మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ అనూహ్యంగా మొదటి నుంచి వెనుకంజలో కొనసాగుతూ వచ్చారు. చివరకు ఓడిపోయారు.

Read More : Malvika Sood : కాంగ్రెస్‌లో చేరిన సోనూసూద్ సోదరి.. అక్కడి నుంచి బరిలోకి

ఆప్ ధాటికి కాంగ్రెస్ తో పాటు బీజేపీ పత్తా లేకుండా పోయాయి. పంజాబ్ రాష్ట్రంలో ఆప్ ఏకపక్షంగా ప్రభుత్వ ఏర్పాటు కు సిద్ధమైంది. తాము రాజకీయాలు చేయము.. ఢిల్లీ అభివృద్ధిని చూడండి.. అదే ఇక్కడ రిపీట్‌ చేస్తామంటూ సౌండ్ రాకుండా సైలెంట్‌ ప్రచారం చేసింది.. ఈ వ్యూహాలే పంజాబ్‌లో ఆప్‌ పాగా వేయడానికి కారణమయ్యాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ తన కొంప తానే కూల్చుకునే పనిలో ఉంటే.. ఢిల్లీలో కేజ్రీవాల్‌ పాలనను శాంపిల్‌గా చూపించి పంజాబ్‌ను కైవసంచేసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ.