Pushpa 2 : పుష్ప 2 కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్న బన్నీ.. వీడియో వైరల్!

ఇటీవల పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన పోస్టర్ లో కాళీమాత గెటప్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచిన అల్లు అర్జున్.. మూవీ కోసం జిమ్‌లో మరింత కసరత్తులు చేస్తున్నాడు. ఆ వీడియో..

Pushpa 2 : పుష్ప 2 కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్న బన్నీ.. వీడియో వైరల్!

Pushpa 2 Allu Arjun doing workouts in GYM video viral

Updated On : April 18, 2023 / 3:59 PM IST

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. టాలీవుడ్ లెక్కలు మాస్టర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఫస్ట్ పార్ట్ భారీ విజయాన్ని సాధించడంతో సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప ది రూల్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న రెండో భాగం నుంచి ఇటీవల ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ తో ఆడియన్స్ లో మూవీ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ టీజర్ గ్లింప్స్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది.

Allu Arjun : సమ్మర్ లో నిజమైన దసరా.. దసరా సినిమాపై ఐకాన్ స్టార్ ప్రశంసలు..

కాగా ఈ సెకండ్ పార్ట్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. తిరుపతి అడవుల్లో పాటు జపాన్, చైనా, మలేషియా దేశాల్లో కూడా యాక్షన్ పార్ట్ ని చిత్రీకరించబోతున్నారు. దీంతో బన్నీ జిమ్ లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాడు. జిమ్ లో అల్లు అర్జున్ వర్క్ అవుట్ చేస్తున్న ఒక వీడియోని నెటిజెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. ఇక ఈ సెకండ్ పార్ట్ లో అల్లు అర్జున్ కాళీమాత గెటప్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఇలాంటి గెటప్స్ మరో రెండు ఉన్నాయని కూడా తెలుస్తుంది.

NTR – Allu Arjun : మరో బాలీవుడ్ సినిమా కోసం అల్లు అర్జున్, ఎన్టీఆర్.. రణ్‌వీర్ సింగ్‌ని కాదని!

ఇండియా వైడ్ సెకండ్ పార్ట్ పై ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని చిత్ర నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్.. ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెడుతున్నారు. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సెకండ్ పార్ట్ లో ఐటెం సాంగ్ కోసం ఏ భామని తీసుకు వస్తారు అని అందరిలో ఆసక్తి నెలకుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రాన్ని మ్యూజిక్ ఇస్తున్నాడు.