Devi Sri Prasad : రాక్‌స్టార్ బర్త్‌డే స్పెషల్.. ‘దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక’..!
‘పుష్ప’ ఫస్ట్ సాంగ్.. ‘దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక’..

Pushpa Movie First Song Update
Devi Sri Prasad: తను సాంగ్ కంపోజ్ చేస్తే ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అందరూ ఎనర్జీతో కాలు కదుపుతారు. స్టార్ హీరోలు, డైరెక్టర్లు తనతో వర్క్ చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తన సంగీతానికి హీరో పాత, కొత్త అనే తేడా తెలియదు. అదిరిపోయే ఆల్బమ్ ఇవ్వడం మాత్రమే తెలుసు.
DSP : పుష్ప కోసం దేవి అదిరిపోయే మ్యూజిక్..
సాంగ్ అయినా, బ్యాగ్రౌండ్ స్కోర్ అయినా, తన స్టైల్లో లిరిక్స్ రాసినా, మాస్ మసాలా పాటలతో థియేటర్లలో మోత మోగించాలన్నా అది ఒక్క రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌కి మాత్రమే సాధ్యం. ఆగస్టు 2 డీఎస్పీ పుట్టినరోజు. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు దేవికి బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు.
Happy birthday @ThisIsDSP!! Here’s to another year of blockbuster albums! Rock on!
— Mahesh Babu (@urstrulyMahesh) August 2, 2021
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. వీళ్లద్దరి క్రేజీ కాంబో.. సుక్కు సినిమాలకు బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారు దేవి. ‘ఆర్య’ నుండి ఇప్పుడు రాబోయే ‘పుష్ప’ వరకు సుక్కు – దేవిల మ్యూజిక్ మైత్రి కొనసాగుతోంది. డీఎస్పీ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్, సుకుమార్, దేవి శ్రీ కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’ నుండి.. ‘దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక’.. అనే ఫస్ట్ సాంగ్ ఐదు భాషల్లో రిలీజ్ చెయ్యనున్నట్లు అప్‌డేట్ ఇచ్చింది టీం.