DSP : పుష్ప కోసం దేవి అదిరిపోయే మ్యూజిక్..

సినిమా ఏదైనా సరే, స్టార్ ఎవరైనా సరే.. సూపర్ హిట్ మ్యూజిక్‌తో సినిమాని సక్సెస్ చెయ్యడంలో ముందుంటాడు దేవి శ్రీ ప్రసాద్..

DSP : పుష్ప కోసం దేవి అదిరిపోయే మ్యూజిక్..

Pushpa

DSP: సినిమా ఏదైనా సరే, స్టార్ ఎవరైనా సరే.. సూపర్ హిట్ మ్యూజిక్‌తో సినిమాని సక్సెస్ చెయ్యడంలో ముందుంటాడు దేవి శ్రీ ప్రసాద్. ఈ మధ్య స్టార్ హీరోలకు దూరమవుతున్న దేవి శ్రీ ..‘పుష్ప’ సినిమాతో తన టాప్ ప్లేస్‌ని సేవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. మరి అందుకు ఏంచేస్తున్నాడో లెట్స్ హ్యావ్ ఎ లుక్.

దేవి శ్రీ ప్రసాద్‌కు హీరో తో సంబందంలేదు.. సినిమా ఎలాంటిదైనా సంబంధం లేదు. వీటన్నింటితో సంబంధం లేకుండా ఏ సినిమా అయినా అదిరిపోయే హిట్ ఇవ్వడమే తెలుసు ఈ మ్యూజిక్ డైరెక్టర్‌కి. కానీ ఈ మద్య ఆడియెన్స్ పల్స్ పట్టుకోవడంలో ఎక్కడో మిస్ ఫైర్ అవుతున్నాడు దేవి. టైమ్ చూసుకుని మిగతా డైరెక్టర్లు స్పీడప్ అవ్వడంతో అలర్ట్ అయ్యాడు దేవి. అందుకే ఇప్పుడు ఫుల్ కాన్సన్‌ట్రేషన్ అంతా ‘పుష్ప’ సినిమా మీదే పెట్టాడు.

సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘పుష్ప’. సుకుమార్ కెరీర్ స్టార్ట్ చేసిన సినిమా ‘ఆర్య’ దగ్గరనుంచి ప్రతి సినిమా దేవి శ్రీ ప్రసాద్‌తోనే చేశాడు. ఇప్పుడు కూడా సుకుమార్-బన్నీ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కోసం దేవీనే మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నాడు. ఈ హ్యాట్రిక్ మూవీని మరింత సక్సెస్ చెయ్యడానికి ఈ సారి అంతకు మించిమ్యూజిక్ ఇస్తున్నాడు దేవి శ్రీ.

‘పుష్ప’ సినిమాలో ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మ్యూజిక్‌తో ఆడియెన్స్‌కి గూస్ బంప్స్ తెప్పించాడు. ఏ ఏజ్‌కి కావల్సినట్టుగా అలాంటి మ్యూజిక్ ఇచ్చి ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేసే దేవి శ్రీ ప్రసాద్ ‘పుష్ప’ సినిమాలో కూడా బన్నీ స్టైల్‌కి తగినట్టు మాస్ మీదే ఎక్కువ కాన్సన్‌ట్రేట్ చేస్తున్నాడు. స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతున్న సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఫుల్‌గా ట్రై చేస్తున్నాడు దేవి శ్రీ ప్రసాద్.

రీసెంట్‌గా ‘ఉప్పెన’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దేవిశ్రీ, ‘పుష్ప’ సినిమాతో పాటు రవితేజ ‘ఖిలాడీ’, కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’, వెంకటేష్ ‘ఎఫ్ 3’ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎన్ని సినిమాలున్నా.. స్టార్ హీరో మూవీ ‘పుష్ప’ మీదే ఫుల్‌గా టైమ్ స్పెండ్ చేస్తున్నాడు దేవి శ్రీ ప్రసాద్. ఈ ఆల్బమ్ సక్సెస్‌తో మళ్లీ తన టాప్ ప్లేస్‌ని సేఫ్ చేసుకోవాలని ఫుల్‌గా ట్రై చేస్తున్నాడు దేవి.