Pushpa The Rise Part – 01 : ‘పుష్ప రాజ్’ క్రిస్మస్‌కి వస్తాండాడబ్బా..
రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు..

Pushpa The Rise Part 01
Pushpa The Rise Part – 01: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ‘ఆర్య’, ‘ఆర్య -2’ తర్వాత వస్తున్న క్రేజీ మూవీ ‘పుష్ప’. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ రికార్డులను తిరగరాశాయి.
Pushpa : ‘పుష్ప’ కోసం ఓవరాల్ ఇండియా వెయిట్ చేస్తోంది..!
తెలుగు ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని స్థాయిలో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ ‘పుష్ప’ టీజర్‌తో సరికొత్త చరిత్ర సృష్టించారు. ‘పుష్ప’ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసింది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు.. క్రిస్మస్ కానుకగా ‘పుష్ప’ ఐదు భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా ‘పుష్ప రాజ్’ థియేటర్లలోకి రాబోతున్నట్లు అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.
Devi Sri Prasad : రాక్‌స్టార్ బర్త్‌డే స్పెషల్.. ‘దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక’..!
ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఆగస్టు 13న ఐదు భాషల్లో ‘పుష్ప’ ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఐదు భాషల్లో 5గురు లీడింగ్ సింగర్స్ ఈ పాట పాడబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్న నటిస్తున్నారు. మిరోస్లా క్యూబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.
Pushpa – The Rise to release in five languages this Christmas.
పుష్ప പുഷ്പ புஷ்பா ಪುಷ್ಪ पुष्पा pic.twitter.com/bSSF9qfGGY
— Allu Arjun (@alluarjun) August 3, 2021