PV Sindhu: లాల్‌ద‌ర్వాజా అమ్మ‌వారికి బంగారు బోనం స‌మ‌ర్పించిన పీవీ సింధు

హైదరాబాద్‌లోని లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి భార‌త‌ స్టార్ షట్లర్ పీవీ సింధు బోనం స‌మ‌ర్పించింది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ... గత ఏడాది టోర్నమెంట్‌ కారణంగా బోనం స‌మ‌ర్పించ‌లేక‌పోయాన‌ని తెలిపింది. త‌న‌కు హైదరాబాద్‌లో నిర్వ‌హించే బోనాల పండుగ అంటే చాలా ఇష్టమ‌ని చెప్పింది.

PV Sindhu: లాల్‌ద‌ర్వాజా అమ్మ‌వారికి బంగారు బోనం స‌మ‌ర్పించిన పీవీ సింధు

PV Sindhu: హైదరాబాద్‌లోని లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి భార‌త‌ స్టార్ షట్లర్ పీవీ సింధు బోనం స‌మ‌ర్పించింది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… గత ఏడాది టోర్నమెంట్‌ కారణంగా బోనం స‌మ‌ర్పించ‌లేక‌పోయాన‌ని తెలిపింది. త‌న‌కు హైదరాబాద్‌లో నిర్వ‌హించే బోనాల పండుగ అంటే చాలా ఇష్టమ‌ని చెప్పింది. ప్రతి ఏడాది అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని భావిస్తాన‌ని తెలిపింది. అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ఇక‌పై ప్రతి ఏడాది బోనాల ఉత్సవంలో పాల్గొంటానని తెలిపింది.

కాగా, లాల్‌దర్వాజా సింహవాహిని మాతామహేశ్వరి ఆలయంలో బోనాల సందడి కొనసాగుతోంది. అమ్మవారి దర్శనం కోసం ఇవాళ‌ తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. గంటలపాటు క్యూలో నిల‌బ‌డాల్సి వ‌స్తోంది. ప‌లువురు కుటుంబ సమేతంగా కలిసి వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. పాత‌బ‌స్తీ లాల్‌ద‌ర్వాజా బోనాల నేప‌థ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.