Radheshyam : రాధేశ్యామ్ సినిమాలో వాటికే 75 కోట్లు ఖర్చు..

'రాధేశ్యామ్' సినిమా సెట్స్ కోసం, ఆర్ట్ వర్క్స్ కోసమే దాదాపు 75 కోట్లు ఖర్చు చేశారట. ఇటీవల జరిగిన ప్రమోషన్స్ లో 'రాధేశ్యామ్' సినిమా ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ మాట్లాడుతూ వీటి గురించి..

Radheshyam : రాధేశ్యామ్ సినిమాలో వాటికే 75 కోట్లు ఖర్చు..

Radheshyam

 

Radheshyam :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా ‘రాధేశ్యామ్’ సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓవర్సీస్ లో, కొన్ని చోట్ల ఇప్పటికే బెనిఫిట్ షోలు పడ్డాయి. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు 200 కోట్లకు పైగా జరిగింది. ఇప్పటికే సినిమా ఒక విజువల్ వండర్ అని చూసిన వారంతా చెప్తున్నారు. ఆ విజువల్స్ అంత బాగుండటానికి ముఖ్య కారణం ఆర్ట్ డిపార్ట్మెంట్, సెట్స్ కూడా ఒక కారణం.

‘రాధేశ్యామ్’ సినిమా సెట్స్ కోసం, ఆర్ట్ వర్క్స్ కోసమే దాదాపు 75 కోట్లు ఖర్చు చేశారట. ఇటీవల జరిగిన ప్రమోషన్స్ లో ‘రాధేశ్యామ్’ సినిమా ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ మాట్లాడుతూ వీటి గురించి తెలిపారు. ఈ చిత్ర కథ అంతా యూరప్ నేపథ్యంలో ఉంటుంది. కరోనా ముందు జార్జియా వెళ్లి అక్కడ షూటింగ్ చేశారు. కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోవడం, లాక్ డౌన్ లు విధించడంతో చేసేది లేక చిత్ర బృందం ఇండియాకి తిరిగి వచ్చింది. ఆ తరువాత కూడా జార్జియా, ఇటలీలో పరిస్థితులు మారకపోవడం, షూటింగ్ లకు అనుమతులు లభించకపోవడంతో చిత్ర బృందం హైదరాబాద్ లోనే ఇటలీని రీక్రియేట్ చేశారు.

Samantha : మరోసారి రెచ్చిపోయిన సమంత..

ఇందు కోసం ఇటలీలో సన్నివేశాలు తీసిన ప్రదేశాలని భారీ సెట్స్ తో నిర్మించారు. హైదరాబాద్ లో మొత్తం 101 సెట్ లని సినిమా కోసం నిర్మించారు. ట్రైన్ సెట్, స్టేషన్, షిప్, కాఫీ షాప్, హీరోయిన్ హౌస్, హాస్పిటల్ సెట్ .. ఇలా సినిమాకు మెయిన్ మెయిన్ అనుకున్నవి అన్ని, ఇటలీ, జార్జియాలో చేయాల్సిన సీన్స్ కి సంబంధించిన ప్రదేశాలని సెట్స్ రూపంలో నిర్మించారు. ఈ సెట్స్ నిర్మించడానికి నిర్మాతలు వెనక్కి తగ్గలేదు. వీటికే 75 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. కరోనా వాళ్ళ ఈ సినిమా బడ్జెట్ 50 కోట్ల వరకు పెరిగింది.