Ragi Ambali : వేసవిలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గించే రాగి అంబలి!

అధిక బరువుతో బాధపడేవారు అంబలిని తాగటం మంచిది. రాగి అంబ‌లి తాగినా చాలా సేపు ఆక‌లి వేయ‌దు. దీంతో క‌డుపు నిండిన భావ‌న కలుగుతుంది. ఆహారం ఎక్కువ‌గా తినాల‌నిపించ‌దు.

Ragi Ambali : వేసవిలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గించే రాగి అంబలి!

Summer Ambli

Ragi Ambali : వేసవి కాలంలో రాగుల‌తో త‌యారు చేసే అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. వేసవి కాలం అంబలి మన శరీరానికి మంచి దివ్య ఔషదంలా పని చేస్తుంది. ఎండకాలంలో అంబలి తాగితే ఒంట్లో వేడి తగ్గిపోతుంది. శరీరాన్ని బాగా చల్లబరుస్తుంది. ఇందులో ఐరన్, ఫైబర్,ఖనిజాలు, అయోడిన్ పుష్కలంగా ఉంటాయి. శరీరానికి కావ‌ల్సిన శ‌క్తి, పోష‌కాలు రాగి అంబ‌లి ద్వారా అందుతాయి. రాగులు, జొన్నలు కొర్రలతో అంబలిని తయారు చేసుకుని తాగవచ్చు. మొలకెత్తిన రాగుల ధాన్యంతో జావకాస్తే పోషకాలు మరిన్ని శరీరానికి అందుతాయి. రాగి అంబలి శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. ఎదిగే పిల్లలకు దీనిని ఇవ్వడం వల్ల శక్తివంతంగా మారతారు.

అధిక బరువుతో బాధపడేవారు అంబలిని తాగటం మంచిది. రాగి అంబ‌లి తాగినా చాలా సేపు ఆక‌లి వేయ‌దు. దీంతో క‌డుపు నిండిన భావ‌న కలుగుతుంది. ఆహారం ఎక్కువ‌గా తినాల‌నిపించ‌దు. ఇది బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది. అంబలి రోజూ తాగడం వల్ల అలసట కూడా రాదు. శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. మధుమేహం, స్థూలకాయం, బీపీతో బాధపడేవారు దీనిని తీసుకోవటం వల్ల బీపీ తగ్గుతుంది. ఒక చక్కటి మెడిసిన్‌లా పని చేస్తుంది. రాగి అంబలిని ఎక్కువగా తాగడం వల్ల శుక్రకణాల సంఖ్య పెరుగుతుందని పలు పరిశోధనల్లో తేలింది. వయస్సు పెరిగే వారికి కూడా ఇందులోని కాల్షియం బాగా సహాయపడుతుంది. పిల్లలకు రాగి అంబలిని తాగించడం వల్ల వారు చాలా చురుగ్గా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అంబలి తయారీ ;

అంబలి తయారు చేయటం కోసం ముందుగా బియ్యప్పిండి మూడు స్పూనులు, సజ్జ పిండి మూడు స్పూనులు, జొన్న పిండి మూడు స్పూనులు, రాగిపిండి ఒక కప్పు, ఉప్పు సరిపడినంత, నీళ్లు తగినన్నీ సిద్ధం చేసుకోవాలి. అనంతరం ఒక గిన్నెలో నీళ్లు పోసి రాగిపిండి కలిపి ఉండల్లేకుండా జావగా చేసుకోవాలి. అందులోనే బియ్యప్పిండి, సజ్జపిండి, జొన్నపిండి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి మూడు గ్లాసుల నీళ్లు పోయాలి. అవి బాగా వేడెక్కాక ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని అందులో వేయాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. చిన్న మంట మీద ఉడకనివ్వాలి. కాస్త చిక్కగా మారాక స్టవ్ కట్టేయాలి. అందులో కొన్ని మజ్జిగ కలుపుకుని తాగితే శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.