Happydays Rahul: రాహుల్ షాకింగ్ మేకోవర్.. నిజంగానే టైసన్ అయిపోయాడే!

హ్యాపీ డేస్ సినిమా అప్పట్లో ఓ సంచలంగా మారిన సంగతి తెలిసిందే. అప్పట్లో టీనేజ్, కాలేజీ కుర్రాళ్లంతా తమని తాము ఆ సినిమాలో చూసుకున్నారు. అంతలా ఒక్కో క్యారెక్టర్ ఒక్కొక్కరికి అలా కుదిరింది.

Happydays Rahul: రాహుల్ షాకింగ్ మేకోవర్.. నిజంగానే టైసన్ అయిపోయాడే!

Rahul Shocking Makeover Really Tyson Is Done

Happydays Rahul: హ్యాపీ డేస్ సినిమా అప్పట్లో ఓ సంచలంగా మారిన సంగతి తెలిసిందే. అప్పట్లో టీనేజ్, కాలేజీ కుర్రాళ్లంతా తమని తాము ఆ సినిమాలో చూసుకున్నారు. అంతలా ఒక్కో క్యారెక్టర్ ఒక్కొక్కరికి అలా కుదిరింది. అలా సినిమాను నడిపించిన పాత్రలలో టైసన్ పాత్ర కూడా ఒకటి. ఆ పాత్రలో రాహుల్ అనే యువకుడు నటించాడు. ఈ సినిమాలో నటించిన వరుణ్ సందేశ్, నిఖిల్ ఆ తర్వాత సోలో హీరోలుగా మారి వరస సినిమాలు చేశారు. కానీ రాహుల్ మాత్రం అవకాశాలను పట్టలేకపోయాడు.

ఈ సినిమాలో నటించిన తమన్నా ఏకంగా స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు దున్నేస్తుంటే మొదట మంచి సినిమాలనే ఎంచుకున్న వరుణ్ సందేశ్ క్రమేపీ గాడితప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఇందువదన అనే సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇక నిఖిల్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ జాగ్రత్తగా తన కెరీర్ ను మలచుకుంటున్నాడు. అమాయకుడైన టైసన్ పాత్రలో నటించిన రాహుల్ విషయానికొస్తే మొదట విఎన్.ఆదిత్య దర్శకత్వంలో రెయిన్ బో అనే సినిమా చేసినా అది ఎలాంటి లాభాన్ని ఇవ్వలేదు.

ఆ తర్వాత 2017లో ‘వెంకటాపురం’ అనే సినిమాతో వచ్చినా.. అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ సక్సెస్ కాలేకపోయింది. కానీ ఇప్పుడు షాకింగ్ మేకోవర్ తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ప్రస్తుతం రాహుల్ 100 క్రోర్స్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మ‌ధ్యే ప్రారంభోత్స‌వం జ‌రుపుకున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్ మీదికి వెళ్ల‌నుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం రాహుల్ సిక్స్ ప్యాక్ బాడీ, పెరిగిన జుట్టు, మీసకట్టుతో తనను తాను ఊహించనివిధంగా మార్చేసుకున్నాడు.

ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హ్యాపీ డేస్ సినిమాలో బాడీ లేని కారణంగానే టైసన్ అని ఆటపట్టిస్తే.. ఇప్పుడు నిజంగానే టైసన్ లా తయారయ్యాడే అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇక 100 క్రోర్స్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను విరాట్ చ‌క్ర‌వ‌ర్తి అనే కొత్త ద‌ర్శ‌కుడు తెరకెక్కిస్తుండగా ఎస్ఎస్ స్టూడియోస్ బేన‌ర్ మీద నాగం తిరుప‌తి రెడ్డి నిర్మిస్తున్నాడు. సాక్షి చౌద‌రి హీరోయిన్ కాగా ఆ మధ్య చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలకు మ్యూజిక్ తో హైప్ తెచ్చిన సాయికార్తీక్ ఈ సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నాడు.

Read: Sonusood: 7 మిలియన్లకు చేరుకున్న సోనూసూద్ ట్విట్టర్ కుటుంబం!