Rainbow In Dreams : మీ కలలోకి ఇద్రధనుస్సు వస్తే దానికి అర్థం ఏంటో తెలుసా..? మంచి జరగుతుందా? చెడు జరుగుతుందా..?

రంగు రంగుల ఇంద్రధనుస్సు మీ కలలోకి వచ్చిందా? అలా వస్తే ఏం జరుగుతుంది? అది దేనికి సంకేతం..?

Rainbow In Dreams : మీ కలలోకి ఇద్రధనుస్సు వస్తే దానికి అర్థం ఏంటో తెలుసా..? మంచి జరగుతుందా? చెడు జరుగుతుందా..?

Rainbow In Dreams

Updated On : July 7, 2023 / 3:45 PM IST

Rainbow Dreams : ఇంద్రధనుస్సు. ఏడు రంగుల ఇంద్రధనుస్సును ఎంత చూసినా తనివి తీరదు. ఆకాశంలో హరివిల్లు కళ్లు తిప్పుకోనివ్వదు. వర్షాకాలంలో ఆకాశంలో ఏడు రంగులతో ఏర్పడే ఇంద్రధనుస్సును చూస్తుంటే అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. అటువంటి ఇంద్రధనుస్సు మీకు ఎప్పుడైనా కలలోకి వచ్చిందా..?

మనిషికి కలలు రావటం సర్వసాధారణం. ఆ కలల్లో ఏవేవో కనిపిస్తుంటాయి. కలలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆందోళనకు కలిగిస్తాయి. మంచి జరిగినట్లుగా కల వస్తే ఆనందం కలుగుతుంది.అదే కీడు జరిగినట్లుగా కల వస్తే ఆందోళన కలుగుతుంది. మరి అంత అందమైన ఇంద్రధనుస్సు కలలోకి వస్తే దేనికి సంకేతం..మంచికా..? చెడుకా..?ఇంద్రధనస్సు కలలోకి వస్తే దాని అర్థం ఏమిటి…?

కలల శాస్త్రాన్ని(Swapan Shastram) నమ్మితే..ప్రతి కలకి ఓ ప్రత్యేకమైన అర్ధం ఉందని నమ్ముతారు. కలలు మనకు భష్యత్తులో జరగబోయే అనేక శుభ సంకేతాలను కలలు అందిస్తాయని నమ్ముతారు. కలలోకి గులాబీలు, కమలాలు వస్తే శుభప్రదం అంటారు. అవి కల్లోకి వస్తే డబ్బు అందుతుందని అర్థమట. తామరపువ్వు అంటే లక్ష్మీదేవి కొలువై ఉండేది. తామరపువ్వు కలల్లోకి వస్తే డబ్బు సంప్రాప్తిస్తుందని అర్థమట.

నిద్రించాక వచ్చే కలలో కొన్ని విషయాలు మనకు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి. మంచి జరిగే విషయాలు, వస్తువులు కనిపిస్తే అంతా శుభమని భావిస్తారు, కొన్ని విషయాలను చూడటం చెడు జరుగుతుందని సూచిందని నమ్ముతారు. మనం కలలో ఇంద్రధనస్సు(Rainbow in Dream)ను చూస్తే ఏం జరుగుతుంది. మీరు కలలో ఇంద్రధనస్సు చూడటం ఒక శుభ సంకేతంగా భావించ వచ్చు. ఎందుకంటే దాని గురించి ఇక్కడ తెలుసుకోండి. Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

కలల శాస్త్రం(Swapan Shastram) ప్రకారం, ఎవరైనా వారి కలలో ఇంద్రధనస్సు చూసినట్లయితే అది మంచికి సంకేతమని భావించవచ్చు. మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఎదురుచూస్తున్నాయని పెద్దలు చెబుతుంటారు. కాబట్టి ఇంద్రధనుస్సు కలలోకి వస్తే మంచిదని ఎటువంటి భయాలు, ఆందోళన అక్కర్లేదని చెబుతుంటారు.

హాయిగా నిద్రిస్తున్న మీకు కలలో ఇంద్రధనస్సు కనిపిస్తే అది మీ జీవితంలోకి కీర్తి, పరువు ప్రతిష్ట పెరుగుదలను సూచనట. ఉద్యోగం చేసేవారికి కలలో ఇంద్రధనస్సు వస్తే ఆ ఉద్యోగులు పనిలో విజయాన్ని అందుకుంటారట. అదే వ్యాపారులకైతే పెట్టుబడులకు తగిన లాభాలు వస్తాయని సంకేతమట. శుభాలు, లాభాలు మీకోసం ఎదురుచూస్తున్నాయని అర్థమట.

వివాహం అయిన మగవారికి ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని భావించవచ్చట. అదే అవివాహితులకు అయితే పెద్దగా విశేషాలేమి లేకపోయినా చెడు మాత్రం జరగదట. వివాహం అయిన మహిళలకు కలలో ఇంద్రధనస్సు కనిపిస్తే, వారికి కష్టాలు వస్తాయని చెబుతారు. భర్తకు, కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందని పెద్దలు చెబుతుంటారు. కాగా ఇవన్నీ కొంతమంది పెద్దలు చెప్పిన విషయాలను బట్టి అందిన సమాచారం ప్రకారం ఇచ్చినదిగా భావించగలరు. కాగా కలలో వచ్చినదే అందరికి జరుగకపోవచ్చు..జరగనూ వచ్చు అది వారి వారి నమ్మకాలను బట్టి ఉంటుందని గమనించగలరు. వచ్చిన కలలు అందరికి వర్తించకపోవచ్చు అని గమనించగలరు..