Rakhi Sawant: హాట్ బ్యూటీ రాఖీ సావంత్ అరెస్ట్.. ఎందుకో తెలుసా?

పోలీసులు రాఖీ సావంత్‌పై సెక్షన్ 354ఏ, 506, 504 కింద కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా తాజాగా రాఖీని అరెస్టు చేసి, ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడ రాఖీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తర్వాత ఆమెను అంధేరి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Rakhi Sawant: హాట్ బ్యూటీ రాఖీ సావంత్ అరెస్ట్.. ఎందుకో తెలుసా?

Rakhi Sawant: బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. మరో నటి షెర్లిన్ చోప్రా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాఖీ సావంత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాఖీ సావంత్ తనపై అనుచితమైన వీడియోలు రూపొందించి, వాటిని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసిందని షెర్లిన్ చోప్రా ఫిర్యాదు చేసింది.

Karnataka: ప్రతిపక్షాల విమర్శలకు తలొగ్గిన కర్ణాటక సర్కారు.. మద్యపానం అర్హత వయస్సు తగ్గింపుపై వెనుకంజ

దీంతో పోలీసులు రాఖీ సావంత్‌పై సెక్షన్ 354ఏ, 506, 504 కింద కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా తాజాగా రాఖీని అరెస్టు చేసి, ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడ రాఖీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తర్వాత ఆమెను అంధేరి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కొంతకాలంగా రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ సాజిద్ ఖాన్ తనను వేధించాడని షెర్లిన్ చోప్రా ఆరోపించింది. అయితే, రాఖీ అతడికి మద్దతు తెలిపింది. షెర్లిన్‌ను తప్పుబట్టింది. దీంతో షెర్లిన్, రాఖీ మధ్య వివాదం ముదిరింది.

Nora Fatehi: గల్‌ఫ్రెండుగా ఉంటే ఖరీదైన ఇల్లు ఇస్తానన్నాడు.. సుకేష్ చంద్రశేఖర్‌పై నోరా ఫతేహి ఆరోపణ

ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసుకున్నారు. కాగా, రాఖీ సావంత్ గత ఏడాది ప్రియుడు అదిల్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. వీరి వివాహం రహస్యంగా జరిగింది. ప్రస్తుతం రాఖీ గర్భం దాల్చినట్లు వెల్లడించింది. గత వారమే ఈ విషయం వెల్లడికాగా, రాఖీ తాజాగా అరెస్టైంది.