Rakhi Sawant: స్పైడర్ ఉమెన్‌గా రాఖీ.. బిగ్‌బాస్‌లోకి ఆహ్వానించాలని డిమాండ్
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఏ పని చేసినా.. ఏం మాట్లాడినా అది వివాదం కావాల్సిందే. వివాదాలు ఎక్కడున్నాయా అని వెతికి మరీ తలదూర్చే ఐటెం బాంబ్ కూడా రాఖీనే.

Rakhi Sawant
Rakhi Sawant: బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఏ పని చేసినా.. ఏం మాట్లాడినా అది వివాదం కావాల్సిందే. వివాదాలు ఎక్కడున్నాయా అని వెతికి మరీ తలదూర్చే ఐటెం బాంబ్ కూడా రాఖీనే. నిత్యం వివాదాల్లో ఉండే సార్ట్స్ తో కూడా కావాలని గొడవ పడుతూ పబ్లిసిటీ కొట్టేయడం కూడా ఈ ఆటం బాంబ్ కే చెల్లుతుంది. ఈ మధ్య కాస్త వివాదాలను పక్కకు పెట్టిన రాఖీ ఇప్పుడు ఏకంగా స్పైడర్ విమెన్ అవతరమెత్తి రోడ్ మీదకి చేరి హల్చల్ చేసింది. తనను బిగ్ బాస్ 15 ఓటీటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది.
రాఖీ మంగళవారం స్పైడర్ మ్యాన్ దుస్తులు ధరించి ముంబై వీధుల్లో తిరుగుతూ హల్చల్ సృష్టించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో రాఖీ స్పైడర్ మ్యాన్ అవతారంలో సూట్‌కేస్‌తో పాటు రోడ్ల మీద వయ్యారాలు పోతూ డాన్స్ చేసింది. తనను బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ లోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. పెద్ద స్పీకర్‌తో పాటు ఆమె పాటలు ప్లే చేసి అభిమానులతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. తాను స్పైడర్-ఉమెన్ అని స్పైడర్ వెబ్‌లతో తన ప్రత్యర్థులను నాశనం చేస్తానని బిగ్ బాస్‌కు చెప్పింది.
మరొక వీడియోలో సల్మాన్ ఖాన్ పాడిన బిగ్ బాస్ థీమ్ సాంగ్‌లో రాఖీ డ్యాన్స్ చేసింది. రాఖీ వినోదాత్మక చేష్టలు అభిమానులను ఆకర్షించగా.. రాఖీ ఇటీవల తాను ఇంకా బిగ్ బాస్ ఓటీటీకి ఆహ్వానించలేదని బాధపపడుతూ ఒక వీడియోను షేర్ చేసింది. బిగ్ బాస్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఎప్పుడూ షోలో భాగస్వామిగా ఉంటానని వాగ్దానం చేసిందని రాఖీ చెప్పింది. సిద్ధార్థ్ శుక్లా.. షెహ్నాజ్ గిల్ లను ఆహ్వానించి.. తనను ఎందుకు ఆహ్వానించలేదని ఆమె ప్రశ్నించింది. కాగా, ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ సీజన్ వోట్ జరుగుతుండగా.. కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడు.
View this post on Instagram