Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సరికొత్త యాడ్.. ఆ స్టార్ హీరో భామల సరసన..

ఇప్పుడంటే చాలా సోప్స్, చాలా యాడ్స్ వచ్చేయడంతో ప్రతి సెలబ్రిటీ ఏదో ఒక యాడ్ లో కనిపిస్తూనే ఉన్నారు. కానీ గతంలో లక్స్ సోప్ యాడ్ కోసం స్టార్ హీరోయిన్లు సైతం ఎదురుచూసేవాళ్ళు. ఆ సోప్ కంపెనీ కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ని మాత్రమే తమ యాడ్స్ కి తీసుకునే వాళ్ళు.

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సరికొత్త యాడ్.. ఆ స్టార్ హీరో భామల సరసన..

Rakul Preet Singh new Lux Ad goes viral

Rakul Preet Singh :  సినీ సెలబ్రిటీలు పలు బ్రాండ్స్ కి యాడ్స్(Ads) చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారని తెలిసిందే. ఇక కంపెనీలు కూడా ఎవరు పాపులర్ గా ఉంటారో, ఎవరికి స్టార్ డం ఉంటుందో వాళ్ళని తమ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంటారు. ఇండియాలో ఓల్డ్ సోప్స్ లో ఒకటి లక్స్(Lux). లక్స్ సోప్ కి ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఇది ఆడవాళ్లు ఎక్కువగా వాడతారు. తమ సోప్ ని మొదటి నుంచి కూడా అలాగే ప్రమోట్ చేసుకుంది లక్స్. లక్స్ బ్రాండ్ కి యాడ్ చేయడం, బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం అంటే ఒకప్పుడు గొప్ప విషయంగా భావించేవారు.

ఇప్పుడంటే చాలా సోప్స్, చాలా యాడ్స్ వచ్చేయడంతో ప్రతి సెలబ్రిటీ ఏదో ఒక యాడ్ లో కనిపిస్తూనే ఉన్నారు. కానీ గతంలో లక్స్ సోప్ యాడ్ కోసం స్టార్ హీరోయిన్లు సైతం ఎదురుచూసేవాళ్ళు. ఆ సోప్ కంపెనీ కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ని మాత్రమే తమ యాడ్స్ కి తీసుకునే వాళ్ళు. 1941లో మొదటి సారి లక్స్ యాడ్ చేసినప్పుడు అప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లీల చిట్నీస్ ని తీసుకున్నారు. అనంతరం మధుబాల, రేఖ, మీనా కుమారి, జీనత్ అమన్, హేమ మాలిని, మాధురి దీక్షిత్, శ్రీదేవి, ఐశ్వర్య రాయ్, జుహీ చావ్లా, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే, అలియా భట్ లు.. ఇప్పటివరకు లక్స్ యాడ్ చేస్తూ వచ్చారు. ఈ యాడ్ కోసం ఎంతోమంది భామలు ఎదురుచూసినా వీరికే దక్కింది.

Vedaant : మరోసారి వార్తల్లో మాధవన్ తనయుడు.. మలేషియన్ ఛాంపియన్‌షిప్ లో ఏకంగా 5 గోల్డ్ మెడల్స్

తాజాగా లక్స్ యాడ్ కు రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి అనంతరం బాలీవుడ్ కి చెక్కేసిన ఈ భామ ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. తాజగా రకుల్ చేసిన లక్స్ కొత్త యాడ్ ని రిలీజ్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తర్వాత ఈ యాడ్ రకుల్ కి దక్కడంతో అందరూ రకుల్ ని అభినందిస్తున్నారు. రకుల్ కూడా ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో పంచుకుంది.