RC 15 : రామ్ చరణ్ – శంకర్ సినిమాకు బ్రేక్..!

శంకర్‌తో సినిమా అనౌన్స్ చేసి మెగా ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్ ఇచ్చాడు చరణ్. అయితే ఈ సినిమా ఎప్పుడు అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు..

RC 15 : రామ్ చరణ్ – శంకర్ సినిమాకు బ్రేక్..!

Ram Charan And Shankar Film Could Be Delayed

RC 15: శంకర్‌తో సినిమా అనౌన్స్ చేసి మెగా ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్ ఇచ్చాడు చరణ్. అయితే ఈ సినిమా ఎప్పుడు అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. చరణ్ రెండు సినిమాల షూటింగ్ బ్యాలెన్స్ కొంచెమే ఉంది కదా.. ఈ ఏడాది స్టార్ట్ చేస్తాడులే అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఏడాది పైనే పట్టేట్టు ఉంది..

చరణ్ నెక్ట్స్ ఏంటి అంటూ ఆశగా ఎదురుచూసిన ఫ్యాన్స్‌కి దిల్ రాజు ప్రొడక్షన్‌లో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో సినిమా తెరకెక్కుతుంది అని అనౌన్స్ చేసి సర్‌ప్రైజ్ చేశారు. చరణ్ ఆగస్ట్ తర్వాత ‘ఆచార్య’, ‘ట్రిపుల్ ఆర్’ కంప్లీట్ చేసుకుని ఫ్రీ అయిపోతే.. శంకర్ సినిమా స్టార్ట్ చేసి నెక్ట్స్ సమ్మర్‌కి రిలీజ్ అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడప్పుడే సినిమా మొదలయ్యే ఛాన్స్ కనిపించడం లేదు.

శంకర్‌తో చరణ్ చెయ్యాలనుకున్న భారీ సినిమా పోస్ట్ పోన్ అవుతుండడంతో చరణ్ ఈ గ్యాప్‌లో మరో సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే శంకర్‌ చరణ్ కంటే ముందు ‘భారతీయుడు-2’ కంప్లీట్ చెయ్యాల్సి ఉంది. ప్రొడ్యూసర్స్‌తో శంకర్‌కు విభేదాలు కూడా వచ్చాయి. సినిమా ఇంకా పట్టాలెక్కదు అనుకున్న టైమ్‌లో శంకర్‌కు ప్రొడ్యూసర్స్‌కు మధ్య కమల్ హాసన్ రాయభారం నడిపించడంతో ‘భారతీయుడు-2’ స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ కంప్లీట్ అవ్వడానికి దాదాపు ఏడాది పైనే పడుతుంది. ఈలోపు చరణ్ తన డేట్స్‌ను ఇంకో సినిమాకు ఇచ్చే అవకాశం ఉంది.

చరణ్‌తో దిల్ రాజుకు, ఇటు మైత్రీకి కమిట్‌మెంట్స్ ఉన్నాయి. అటు ‘ఆచార్య’ ను తెరకెక్కిస్తున్న కో- ప్రొడక్షన్ హౌస్ మాట్నీ కూడా చరణ్‌తో సినిమా చేయాల్సి ఉంది. శంకర్ ఫ్రీ అయ్యే లోపు ఈ ముగ్గురిలో ఎవరి బ్యానర్‌లో అయినా చరణ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎవరితో చేసినా కానీ.. ఈ సినిమాను 6 నెలలలోపు కంప్లీట్ చేసి.. 2022 ఫస్ట్ క్వార్టర్‌లో శంకర్ సినిమాను పట్టాలు ఎక్కించే ప్లాన్‌లో ఉన్నట్టు టాక్..